ముల్లంగి ఆకుల జ్యూస్ తాగితే బరువు త‌గ్గుతారా..?

ముల్లంగి.చాలా మంది ఇష్ట‌ప‌డ‌ని కూర‌గాయ‌ల్లో ఇది ఒక‌టి.

ఘాటైన రుచి, వాస‌న క‌లిగి ఉండ‌టం వ‌ల్ల‌నే ముల్లింగిని ఎవ్వ‌రూ తినేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌రు.

కానీ, ముల్లంగిలో ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.ముల్లంగి మాత్ర‌మే కాదు ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా ముల్లంగి ఆకుల‌తో జ్యూస్ చేసుకుని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

మ‌రి ముల్లంగి ఆకుల జ్యూస్ ఎలా త‌యారు చేసుకోవాలి.? అస‌లు ముల్లంగి జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే బెనిఫిట్స్ ఏంటీ.

? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కొన్ని ముల్లంగి ఆకుల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌లో కొన్ని ముల్లంగి ఆకులను వేసి మెత్త‌గా రుబ్బుకొని జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి.

ఈ జ్యూస్‌లో చిటికెడు న‌ల్ల మిరియాల పొడి, కొద్దిగా న‌ల్ల ఉప్పు మ‌రియు రుచికి స‌ర‌ప‌డా నిమ్మ ర‌సం క‌లుపుకుని సేవించాలి.

అధిక బ‌రువుతో బాధ ప‌డే వారికి ఈ ముల్లంగి ఆకుల జ్యూస్ ఓ అద్భుత‌మైన వ‌రంగా చెప్పుకోవ‌చ్చు.

ఎందుకంటే, ముల్లంగి ఆకుల జ్యూస్‌ను తీసుకుంటే అందులోని ప‌లు పోష‌క విలువ‌లు శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వును వేగంగా క‌రిగించి బ‌రువును కోల్పోయేలా చేస్తుంది.

"""/"/ అలాగే కొంద‌రు త‌ర‌చూ నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతుంటారు.

అలాంటి వారు ముల్లంగి ఆకుల జ్యూస్ తీసుకుంటే శ‌రీరానికి బోలెడంత శ‌క్తి ల‌భిస్తుంది.

త‌ద్వారా నీర‌సం, అల‌స‌ట వంటివి దూరం అవుతాయి.ఇక ముల్లంగి ఆకుల జ్యూస్‌ను సేవించ‌డం వ‌ల్ల అందులోని ఫైబ‌ర్ కంటెంట్ జీర్ణ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తుంది.

ఫ‌లితంగా గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

వైరల్: ఈ కుర్రాడి స్పీడ్‌ చూసి కంపెనీలే భయపడుతున్నాయి… మేన్ మెషీన్ అనాలేమో?