ఎన్ని చేసినా జ్వ‌రం వ‌ద‌ల‌ట్లేదా? అయితే ముల్లంగి జ్యూస్ ట్రై చేయండి!

జ్వ‌రం స‌ర్వ సాధార‌ణ స‌మ‌స్య‌.పిల్ల‌లు, పెద్ద‌లు, స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అంద‌రిపై ఎప్పుడోకప్పుడు జ్వ‌రం ప్ర‌భావం చూపే ఉంటుంది.

అయితే ఒక్కో సారి ఎన్ని చేసిన జ్వ‌రం త‌గ్గ‌నే త‌గ్గ‌దు.దాంతో నీరసం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు పెరిగి పోతుంటాయి.

అలాంట‌ప్పుడు ముల్లంగి జ్యూసే బెస్ట్ అప్ష‌న్ అని చెప్పొచ్చు.అవును, జ్వ‌రాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా మ‌రియు వేగంగా త‌గ్గించ‌డంలో ముల్లంగి జ్యూస్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఘాటైన వాస‌న‌, రుచిని క‌లిగి ముల్లంగిలో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ కె, విట‌మిన్ ఎ, ఫైబ‌ర్, కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇలా ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

అందుకే ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో జ‌బ్బుల‌ను కూడా నివారిస్తుంది.

ముఖ్యంగా జ్వ‌రంతో బాధ ప‌డే వారు ఫ్రెష్‌గా ఉండే ముల్లంగి ముక్క‌లు జ్యూసర్ లో వేసి బ్లెండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి.

ఇప్పుడు ఈ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మ ర‌సం మ‌రియు చిటికెడు మిరియాల పొడి వేసి తీసు కోవాలి.

ఈ ముల్లంగి జ్యూస్‌ జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంలో ఓ మెడిసిన్‌లా ప‌ని చేస్తుంది.ముల్లంగి జ్యూస్‌లో ఉండే పోష‌కాలు శ‌రీరంలో పెరిగిన ఉష్ణోగ్ర‌త‌ల‌ను తగ్గించి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

"""/" / జ్వ‌రాన్ని త‌గ్గించ‌డ‌మే కాదుముల్లంగి జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి.

ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.అధిక బ‌రువు త‌గ్గుతారు.

ర‌క్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.శ‌రీరం డీహైడ్రేట్ అవ్వ‌కుండా ఉంటుంది.

మ‌రియు ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

జూనియర్ ఎన్టీఆర్ కి టీడీపీ పగ్గాలు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!