ముల్లంగితో ఇలా చేస్తే..మొటిమలు మటుమాయం అవ్వాల్సిందే!
TeluguStop.com
మొటిమలు బాధిస్తున్నాయా ? ఎన్ని క్రీములు రాసినా తగ్గడం లేద ? మొటిమల విషయంలో మీ ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయా ? అయితే మీకు ముల్లంగినే బెస్ట్ అప్షన్.
అవును, మొటిమలను తగ్గించడంలో ముల్లంగి అద్భుతంగా సహాయపడుతుంది.మొటిమలనే కాదు మరెన్నె చర్మ సంబంధిత సమస్యలను నివారించడంలోనూ ముల్లంగి ఉపయోగపడుంది.
మరి ముల్లంగిని చర్మానికి ఎలా వాడాలి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలతో బాధ పడే వారు ముందుగా ఫ్రెష్‌గా ఉండే ఒక ని తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్‌లో కొద్దిగా స్వచ్ఛమైన తేనె కలిపి.మొటిమలు ఉన్న చోట అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల అనంతరం చల్లటి నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే మొటిమలు క్రమంగా మటుమాయం అవుతాయి.
"""/" /
చర్మ ఛాయను పెంచడంలోనూ ముల్లంగి ఉపయోగపడుతుంది.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ముల్లంగి పేస్ట్, ఒక స్పూన్ ఓట్స్ పౌడర్ మరియు ఎగ్ వైట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పావ గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేస్తూ ఉంటే స్కిన్ టోన్ పెరుగుతుంది.
ఇక మచ్చలు, ముడతలుతో ఇబ్బంది పడే వారు ఒక బౌల్ రెండు స్పూన్ల ముల్లంగి పేస్ట్, ఒక స్పూన్ బాదం ఆయిల్ మరియు ఒక స్మూన్ లెమెన్ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి.పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే మచ్చలు, ముడతలు పోయి.ముఖం కాంతి వంతంగా, యవ్వనంగా మారుతుంది.
ఎన్టీఆర్ నెల్సన్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వైరల్.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే!