ఇండియన్ సినిమా కంటే హాలీవుడ్ సినిమాలోనే నేను కంఫర్ట్

బాలీవుడ్ సినీ పరిశ్రమలు కొంత మంది భామలు తమ మనసులో విషయాలు నిర్మొహమాటంగా చెప్పేస్తారు.

ఎవరు ఏం అనుకున్న తమకి సంబంధం లేదు అన్నట్లు వారు తమ ఫీలింగ్స్ ని బట్టలు విప్పినట్లు విప్పెస్తారు.

అలాంటి నటీమణులలో రాధికా ఆప్టే మొదటి వరుసలో ఉంటుంది.తెలుగులో లెజెండ్, లయిన్ సినిమాలతో పాటు, తమిళంలో రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కి జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

హాలీవుడ్ సినిమాలలో న్యూడ్ గా కూడా నటించడానికి సై అంటున్న ఈ భామ ఇండియన్ సినిమాల మీద, ఇక్కడి దర్శకుల మీద సమయం దొరికినప్పుడు అల్లా నోరు పారేసుకుంటుంది.

ప్రస్తుతం లిబర్టీ.ఏ కాల్ టు స్పై’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న రాధికా ఆప్టే బాలీవుడ్, హాలీవుడ్ చిత్రపరిశ్రమల్లో పనిచేయడానికి మధ్య ఉన్న తేడాపై మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వాఖ్యలు చేసింది.

హాలీవుడ్ లో జనాలు క్రమశిక్షణ, నిబద్దతతో ఉంటారు.అంతేకాదు వాళ్లు సరైన టైంలో డబ్బులు ఇస్తారు.

మన పని కోసం వాళ్లను అడుక్కునే అవసరం ఉండదు.ఇండియాలోలాగా హాలీవుడ్ లో పనిచేసే నటీనటులకు డబ్బు కోసం అడుక్కునే అవసరం రాదని చెప్పుకొచ్చింది.

రాధిక ఆప్టే మాటల బట్టి బాలీవుడ్ సినిమాలలో సమయానికి డబ్బులు ఇవ్వరని, రెమ్యునరేషన్ ఇవ్వకుండా తప్పించుకుంటారు అని పరోక్షంగా కామెంట్స్ చేసినట్లు అయ్యింది.