ఒకప్పుడు జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత.. కానీ ఇప్పుడు కేవలం రాధిక అక్క మాత్రమే !
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా పేరు పాపులర్ అయితే అది మళ్లీ రిపీట్ అవుతూనే ఉంటుంది.
ఉదాహరణకు ఒకప్పుడు జ్యోతిలక్ష్మి( Jyotilakshmi ) అనే ఐటమ్ భామ నేటి వరకు గుర్తుంది అంటే ఆమె పేరులో ఉన్న స్పెషాలిటీ అదే మరి.
ఐటెం సాంగ్స్( Item Songs ) తో ఆ మధ్య ఆమె చేసిన హవా అంతా ఇంత కాదు.
ఆమె లాగానే చాలామంది నటీమనులు వచ్చిన ఐటెం సాంగ్స్ తో అదరగొట్టిన ఆ రేంజ్ పాపులర్ దక్కలేదు.
ఆమె తర్వాత కాస్త కూస్తో మళ్లీ పాపులారిటీ దక్కించుకున్న నటి ఉన్నారా అంటే అది సిల్క్ స్మిత ( Silk Smita )మాత్రమే.
అలా పేర్లతోనే పాపులారిటీ వచ్చింది.అలాగే పేరుకు తగ్గట్టుగానే వారి పెర్ఫార్మన్స్ ఉండేది.
కానీ నేటి యువతరానికి ఇలాంటి ఒక ఐటమ్ గర్ల్ లేనేలేదు. """/" /
అయితే ఇలా ఒకసారి పాపులర్ అయిన హీరోయిన్స్ పేర్లను తమ పిల్లలకు పెట్టడానికి కూడా జనాలు భయపడే స్టేజిలో ఉండేవారు జ్యోతిలక్ష్మి అనే పేరు పెట్టుకోవడానికి నేటి యువతకు పెద్ద నామోషి ఉంటుంది.
ఇక సిద్దు జొన్నలగడ్డ ( Siddu Jonnalagadda )పుణ్యమా అని తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మరో అద్భుతమైన పేరు రాధిక అక్క.
ఎవరైనా రాధిక పేరు పెట్టుకుంటే చాలు ఇప్పుడు జనాలంతా ఒకలా చూడడం మొదలు పెడుతున్నారు.
రాధికా ( Radhika )అనే జాతి సపరేటుగా ఒక వెరైటీ రకం అనే విధంగా డీజే టిల్లు లో హీరోయిన్ క్యారెక్టరైేజెషన్ అంటే ఆ పేరు ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో చెప్పాల్సిన అవసరం లేదు.
"""/" /
ఇక వచ్చే జనరేషన్ లో ఎవరైనా సరే తమ కూతుర్లకు రాధిక అనే పేరు పెట్టుకోవాలంటే గడగడలాడల్సిన పరిస్థితి.
మొత్తానికి డీజే టిల్లు సినిమా( DJ Tillu Movie ) జనాలకు గట్టిగా ఎక్కింది ఇప్పుడు సీక్వెల్ తో మరో మారు వచ్చేయడానికి ఫిబ్రవరిలో జనాల ముందుకు రాబోతున్నారు సిద్దు.
టిల్లు పాత్రలో సిద్దు జొన్నలగడ్డ అద్భుతంగా నటించాడు నటిస్తాడు అనడంలో సందేహం లేదు.
అయితే రాధిక పాత్రలోనే అనుపమ ఎలా నటిస్తుంది జనాలను ఎలా మెప్పిస్తుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అది కూడా సినిమా విడుదలయితే అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్2, సోమవారం 2024