గెట్ రెడీ.. రాధేశ్యామ్ నుండి మరొక టీజర్ రాబోతుందట!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రాధేశ్యామ్'.

ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు.కానీ మొన్నటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు.

ఇక ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాధేశ్యామ్ నుండి టీజర్ ను విడుదల చేసారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆసక్తిగా ఉంది.ఇది ఇటలీ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ.

ఈ ప్రేమ కథకు అద్బుతమైన గ్రాఫిక్స్ యాడ్ చేసి టీజర్ ను వదలడంతో ఈ సినిమా అన్ని ప్రేమ కథల లాగా మాములుగా ఉండదని అందరికి అర్ధం అయ్యింది.

ఈ సినిమాకు గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయం తీసుకున్నారు.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి విడుదల చేయబోతున్నారు.

ఇక విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశారు చిత్ర యూనిట్.

రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. """/"/ మొన్ననే ఒక టీజర్ వదిలిన టీమ్ ఇప్పుడు మరొక టీజర్ ను రెడీ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

మరి మరొక టీజర్ ను ఎప్పుడు వదులుతారో ప్రకటన వస్తే కానీ తెలియరాదు.

"""/"/ ఇక ఈ అద్భుతమైన లవ్ స్టోరీలో మొత్తం 6 పాటలు ఉన్నాయట.

ప్రతి పాటను కూడా అద్భుతంగా తెరకెక్కించారట.ఇది ప్రేమ కథ కాబట్టి పాటల మీద కూడా ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

ఇక ఈ పాటలను కూడా ఒక్కొక్కటిగా విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.ఇక ఇప్పటి నుండి ఈ సినిమా నుండి గ్యాప్ లేకుండా అప్డేట్ లు రావడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇప్పటికే ప్రభాస్, పూజా మధ్య రొమాన్స్ అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది.

అందుకే ఈ అందమైన ప్రేమ కథను తెరమీద చూడడానికి ప్రేక్షకులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

వైరల్ వీడియో: రోడ్డుపై గన్ పట్టుకుని హల్చల్ చేసిన యువతి..