రాధేశ్యామ్ డైరెక్టర్ గొప్ప మనసు.. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మౌత్ ఆర్టిస్ట్ పై ప్రశంసలు?

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన రాధేశ్యామ్ ఇటీవలే మార్చి 11న విడుదలైన విషయం తెలిసిందే.

ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.భారీ అంచనాల నడుమ థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి భారీ కలెక్షన్లు రాబట్టింది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా రాధేశ్యామ్ సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఎప్పటిలాగే ఒక వర్గం వారు సినిమా బాగోలేదు అంటూ, స్లోగా ఉంది అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.

కేవలం ఈ సినిమా పైనే కాకుండా ప్రతి ఒక్క సినిమాపై కూడా ఈ విధంగా నెగిటివ్ ఆ కామెంట్స్ చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలోని థీమ్ ఒక యువతిని ప్రేరేపించింది.ఆమె ఎవరో కాదు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ఫిజికల్లీ చాలెంజ్డ్ మౌత్ ఆర్టిస్ట్ స్వప్నిక.

ఈమె గతంలో కూడా అనేక బొమ్మలను నోటితోనే పెయింటింగ్ వేసింది.ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ని కూడా నోటితో వేసి విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది.

"""/" / ఈ నేపథ్యంలోనే తాజాగా రాధేశ్యామ్ సినిమాను చూసి ఆ సినిమా తనకు ఏ విధంగా స్ఫూర్తినిచ్చింది అంటూ ఒక పెయింటింగ్ వేసి ట్వీట్ చేసింది.

ఇక ఈ పెయింటింగ్ చూసిన రాధేశ్యామ్ సినిమా దర్శకుడు రాధా క్రిష్ణ ఆ ట్వీట్ ని చూసి అభినందించారు.

అంతేకాకుండా అదే విషయం గురించి పలు ప్రెస్ మీట్ లో కూడా స్పందించారు.

ఈ క్రమంలోనే తాజాగా దర్శకుడు రాధాకృష్ణ ఆ పెయింటింగ్ వేసిన అమ్మాయిని కలుసుకున్నాడు.

ఆమెతో పాటుగా ఆమె గీసిన పెయింటింగ్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఆ అమ్మాయి తో దిగిన ఫోటో ని షేర్ చేస్తూ రాధేశ్యామ్ సినిమా మీకు స్ఫూర్తినిచ్చింది.

మీరు ఈ రోజు నాతో పాటు దేశాన్ని కూడా ప్రేరేపించారు.నా లాంటి దర్శకులు ఏదో ఒకరోజు నీ లాంటి వారిఫై దర్శకులు సినిమా చేస్తారని నమ్ముతున్నాను దేవుడు నిన్ను చల్లగా చూడాలి అంటూ రాధాకృష్ణ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మామయ్య పవన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సాయితేజ్.. అభిమానానికి ఫిదా అంటూ?