ఇటలీలో రాధేశ్యామ్ కూడా మొదలుపెట్టాడు!
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్‌ను జరుపుకుంటుండగా, కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.
కాగా కరోనా వైరస్ కారణంగా యావత్ సినిమా షూటింగ్‌లు వాయిదా పడటంతో రాధేశ్యామ్ చిత్ర యూనిట్ జార్జియా నుండి హుటాహుటిన స్వదేశానికి చేరుకుంది.
అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు తిరిగి మొదలవుతుండటంతో రాధేశ్యామ్ చిత్రం కూడా షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు రెడీ అయ్యింది.
ఈ క్రమంలోనే రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ఇటలీ చేరుకున్నారు.అక్కడ హీరోహీరోయిన్లపై పలు కీలక సీన్స్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
ప్రభాస్ వింటేజ్ లుక్‌లో దర్శనమిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర సినిమాలో చాలా కీలంగా మారనుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
మొత్తానికి కరోనా కారణంగా లాక్‌డౌన్ నెలకొనండంతో ఇప్పుడు రాధేశ్యామ్ షూటింగ్ విషయంలో చాలా పకడ్బందీగా ఉన్నట్లు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని, అటుపై సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇక అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని రాధేశ్యామ్ చిత్రం నుండి ఏదైనా భారీ అప్‌డేట్ రావడం ఖయమని చిత్ర యూనిట్ అంటోంది.
మరి రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్రభాస్ బర్త్‌డేకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో చూడాలి అంటున్నారు అభిమానులు.
కాగా ఈ సినిమాలో పలువురు ముఖ్య నటీనటులు కూడా నటిస్తున్నారు.
ప్రాణాలకు తెగించి మనిషిని కాపాడిన గుర్రం.. ఇప్పుడు దానికేమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!