ప్రభాస్ సినిమా కోసం ఆ విధంగా ప్రొమోషన్స్.. వర్కౌట్ అవుతుందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల్లో రాధేశ్యామ్ ఒకటి.రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా మార్చి 11న రిలీజ్ అయ్యింది.ముందు నుండి భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులను ఈ సినిమా బాగా నిరాశ పరిచింది.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు.

పాన్ ఇండియా స్టార్ అయినా ప్రభాస్ అసలు ఇలాంటి ఒక సినిమా ఎలా చేసాడు అని ఆయన ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు.

ఈ సినిమాతో యూవీ వారికీ గట్టిగానే పడింది.ఏకంగా 100 కోట్ల నష్టాలను మిగిల్చిందని వార్తలు వస్తున్నాయి.

కనీసం ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ను కూడా మెప్పిచలేక పోయింది.జాతకాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ చెప్పిన జాతకం ఎక్కడ తప్పదు.కానీ క్లైమాక్స్ లో మాత్రం ఫెయిల్ అవ్వడంతో ఫ్యాన్స్ అందరు అయోమయానికి లోనయ్యారు.

ఇక్కడ క్లారిటీ లోపించడంతో సినిమా దెబ్బతింది.థియేటర్ లో ఘోరంగా విఫలం అయినా ఈ సినిమా ఆ తర్వాత ఓటిటి లో రిలీజ్ చేసిన అలంటి ఫలితమే రాబట్టి భారీ ప్లాప్ ఎదుర్కోక తప్పలేదు.

ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెర మీద ప్రసారం కాబోతుంది.ఈ సినిమా ప్రసార హక్కులను జీ తెలుగు వారు దక్కించుకున్నారు.

"""/" / జీ తెలుగు ప్రభాస్ సినిమా కోసం కొత్తగా ప్రచారం స్టార్ట్ చేసారు.

భీమవరంలో రాధేశ్యామ్ సినిమాలోని ముఖ్యమైన ఘట్టాలతో థీమ్ పార్క్ ను ఏర్పాటు చేసారు.

ఈ నెల 26న జీ తెలుగులో ఈ సినిమాను ప్రసారం చేయబోతున్నారు.అందుకే ఈ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లే విధంగా కొత్త ప్రచారం చేస్తున్నారు.

మరి థియేటర్ లలో.ఓటిటి లలో ఫెయిల్ అయినా ఈ సినిమా బుల్లితెర మీద అయినా మంచి టీఆర్పీ రాబడుతుందో లేదో చూడాలి.

ఛీ, రైలు టాయిలెట్‌లో టీ పాత్రలు కడుగుతున్నాడుగా.. వీడియో చూస్తే వాంతి చేసుకుంటారు!