రాధేశ్యామ్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో రాధేశ్యామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ చూస్తున్నారు.

కాగా ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా వింటేజ్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతుండటంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా అని ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈపాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది.

కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికంటే ఎక్కువ ఆలస్యం అవుతూ వస్తోంది.

ఇక కరోనా కారణంగా మరింత ఆలస్యంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.దీంతో ఈ సినిమా ఇప్పటికైనా అనుకున్న సమయానికి పూర్తవుతుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది.

2021 వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో సంక్రాంతి నాటికి ఈ సినిమా షూటింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోవాలని ప్రభాస్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

మరి ఈసారైనా అనుకున్న సమయానికి రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ ముగించుకుంటుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమాను అనుకున్న సమయంలో ముగించి రిలీజ్ ఎప్పుడు చేస్తారో అనే సందేహం అందరిలో నెలకొంది.

టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ ఆమేనా.. ఈ బ్యూటీకి అభిమానులు ఓటేశారా?