నయనతారపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు.. ఏమైందంటే..?

స్టార్ హీరోయిన్ నయనతార తెలుగు, తమిళ భాషల్లో నటిగా మంచి పేరును సంపాదించుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో పారితోషికం అందుకుంటూ నటిగా ఒక వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే.

విఘ్నేష్ శివన్ తో నయనతారకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని త్వరలో పెళ్లి కూడా జరగబోతుందని వార్తలు వచ్చాయి.

కోలీవుడ్ ఇండస్ట్రీలో నయనతార లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు.

తమిళ నటులలో ఒకరైన రాధారవి డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ కుమారుడైన ప్రముఖ నటుడు ఉదయనిధి స్టాలిన్, నయనతార రిలేషన్ షిప్ లో ఉన్నారని, సహజీవనం చేస్తున్నారని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

రాధారవి చేసిన కామెంట్లపై నయనతార ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. """/" / డీఎంకే పార్టీ నేతల నుంచి కూడా రాధారవి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక ప్రముఖ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్న రాధారవి డీఎంకే పార్టీపై విమర్శల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ నటుడు కమల్ హాసన్ గురించి కూడా మాట్లాడిన రాధారవి కమల్ ముగ్గురు భార్యల గురించి కామెంట్లు చేశారు.

కమల్ హాసన్ భార్యలను కాపాడుకోలేకపోయాడని ఇక ప్రజలను ఏం కాపాడతాడంటూ రాధారవి విమర్శలు చేశారు.

రాధారవి శృతి మించి చేసిన విమర్శలపై ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్న ఉదయనిధి స్టాలిన్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

6వ తేదీన ఎన్నికలు జరగనుండగా ఉదయనిధి స్టాలిన్, నయనతార పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా రాధారవి చేసిన కామెంట్లపై నయనతార ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

అనవసరంగా సవాల్ చేశామా ? రుణమాఫీ పై బీఆర్ఎస్ టెన్షన్