Rachana Banerjee : 40 సినిమాలకు పైగా ఒకే హీరోతో నటించిన నటి రచన.. ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే..!
TeluguStop.com
రచనా బెనర్జీ( Rachana Banerjee ).ఈ పేరు తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
చాలా ట్రెడిషనల్ గా కనిపించే ఈ అందాల తార నేను ప్రేమిస్తున్నాను, కన్యాదానం, రాయుడు, మామిడాకులు, అభిషేకం, బావగారు బాగున్నారా, పిల్ల నచ్చింది, లాహిరి లాహిరి లాహిరిలో వంటి సినిమాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యింది.
ఈ ముద్దుగుమ్మ వెస్ట్ బెంగాల్లో జన్మించింది.1993లో ఒక బెంగాలీ సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయం అయింది.
దానికంటే ముందు 1992లో ఒక ఒరియా సినిమాతో తెరపై మెరిసింది. """/" /
తర్వాత బెంగాలీ, ఒరియా( Bengali, Oriya ) సినిమాల్లో నటిస్తూ ఆ రెండు ఇండస్ట్రీలలో బాగా ఫేమస్ అయ్యింది.
వి సత్యనారాయణ( EVV Satyanarayana ) రచన టాలెంట్ గుర్తించి తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు.
సినిమాల్లోకి రాకముందు ఈ ముద్దుగుమ్మ మిస్ కోల్‌కతా టైటిల్ నెగ్గింది.తెలుగు సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ 2002 తర్వాత నటించలేదు.
అందుకు ఆమెకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయని తెలిసింది. """/" /
అయితే రచన సినీ కెరీర్‌లో ఒక అద్భుతమైన రికార్డు ఉంది.
అదేంటంటే ఈమె ఒరియా భాషలో ఒకే హీరోతో 40కి పైగా సినిమాల్లో నటించింది.
రచన మొత్తం 50 సినిమాల్లో చేస్తే వాటిలో 40కు పైగా ఒకే హీరోతో కలిసి నటించడం ఆ ఇండస్ట్రీలో ఒక అరుదైన విశేషంగా నిలిచిపోయింది.
ఇంతకీ ఆ హీరో పేరేంటి అంటే.సిద్ధాంత్ మహాపాత్ర( Siddhant Mahapatra ).
ఒరియా ఇండస్ట్రీలో ఎదురులేని హీరోగా కొనసాగిన సిద్ధాంత్ తో రచనా ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది.
తర్వాత వారిద్దరు విడాకులు తీసుకున్నారు.ఈ హీరోని ప్రేక్షకులు ముద్దుగా మున్నా భాయ్ అని పిలుస్తారు.
తరువాత రచనా 2007లో ప్రోబల్ బసును వివాహం చేసుకుంది.వారికి ఒక కుమారుడు ఉన్నాడు.
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికి ఇంకా పిల్లలు చిన్న వారు కావడం తో టైం తీసుకుంటుంది.
ఇద్దరు పిల్లల తల్లి అయిన కూడా రచన ఇంకా అందం లో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
వెట్రిమారన్ డైరెక్షన్ లో అవసరమా తారక్.. ఈ సినిమా రిజల్ట్ చూసైనా మారతావా?