కొడుకుల్ని ప్రపంచం కోసం త్యాగం చేసిన మహాతల్లి అంజనాదేవి.. రచ్చరవి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లలో ఒకరైన రచ్చరవి ( Racha Ravi ) మెగా ఫ్యామిలీని ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.

జబర్దస్త్ లో మళ్లీ ఛాన్స్ వచ్చినా వెళ్లలేనని డేట్లతోనే సమస్య అని రచ్చరవి అన్నారు.

నాకు యూట్యూబ్ సినిమాలే ఎక్కువ అయ్యాయని ఆయన తెలిపారు.లైగర్ లో హిందీ పాత్రకు నా డబ్బింగ్ నేను చెప్పుకున్నానని రచ్చరవి కామెంట్లు చేశారు.

జబర్దస్త్ కు నాలుగు రోజుల కోసం సమయం కేటాయించాలని ఆ సమయం నా చేతిలో లేదని రచ్చరవి అన్నారు.

సినిమాలు హిట్టవుతున్నాయని సినిమాలు పిలిచి ఇస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు.సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి సినిమాలకు నేను డేట్లు కేటాయించడం కష్టమైందని రచ్చ రవి చెప్పుకొచ్చారు.

రెండు పడవలపై ప్రయాణం చేస్తే సమస్యలు తప్పవని ఆయన తెలిపారు.మల్లెమాలలో మాల మాత్రమే పర్మినెంట్ అని రచ్చ రవి చెప్పుకొచ్చారు.

"""/" / నేను మెగా హీరోలలో( Mega Heroes ) ముగ్గురు అన్నయ్యలతో ట్రావెల్ అయ్యానని నాగబాబు అన్న చిన్న సమస్యకు కూడా రియాక్ట్ అవుతారని రచ్చ రవి కామెంట్లు చేశారు.

ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అయ్యాయని ఆయన వెల్లడించారు.కొడుకుల్ని ప్రపంచం కోసం త్యాగం చేసిన మహాతల్లి అంజనాదేవి ( Anjana Devi ) అని రచ్చ రవి పేర్కొన్నారు.

మెగా హీరోలు ఇంట్లో కంటే బయట ఎక్కువగా ఉంటారని ఆయన అన్నారు. """/" / చిరంజీవి రోల్ మోడల్( Chiranjeevi ) అని రచ్చ రవి తెలిపారు.

తనకు మించి ఏదైనా చేయాలనే తపన నాగబాబులో ఉంటుందని రచ్చ రవి చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని మరిచిపోయి సమాజం కోసం తిరుగుతున్నాడని ఆయన అన్నారు.చరణ్ రాముడు అని వరుణ్ తేజ్ కొత్త కథలను ఎంచుకుంటున్నాడని రచ్చ రవి వెల్లడించారు.

అన్ని స్లాంగ్స్ ను నేను మాట్లాడగలనని రచ్చ రవి చెప్పుకొచ్చారు.

కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?