మాచర్ల రచ్చ : లోకేష్ ఇరుక్కుపోయారుగా ? 

ఏపీలోని మాచర్ల నియోజకవర్గం లో చోటు చేసుకున్న వ్యవహారానికి సంబంధించి రోజురోజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(pinnelli Ramakrishna Reddy,) ఈవీఎం ద్వంసం చేసిన ఘటన లో కొత్త ట్విస్ట్ లు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈవీఎం ను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారనే ఆరోపణలతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై సీరియస్ యాక్షన్ కు దిగింది.

  పిన్నెల్లి పై లుక్ అవుట్ నోటీసు జారీ చేయడంతో పాటు , అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఎన్నికల సంఘం ఆదేశించింది .

అయితే రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించడం,  హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు,  జూన్ 5వ తేదీ వరకు ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించడంతో ఈ వ్యవహారం కాస్త సర్ధుమణిగినట్టు అయ్యింది.

"""/" / మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్నట్లుగా దృశ్యాలు ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అయితే ఆ వీడియోను తాము విడుదల చేయలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది.దీంతో అసలు ఆ వీడియో ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఎలా బయటకు వెళ్లిందనే దానిపైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena)విచారణకు ఆదేశించారు.

"""/" / ఈ వీడియో బయటకు రావడం వెనుక టిడిపి (TDP)జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) హస్తం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ వీ ఎం  ధ్వంసం చేస్తున్న వీడియోను మొదటిగా నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ లో పోస్ట్ చేశారని తెలుస్తోంది.

"""/" / ఈ వ్యవహారంతో వీడియో లీకేజి వెనుక లోకేష్ పాత్ర ఉందా అనే కోణంలో ఎన్నికల కమిషన్ విచారణ జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది .

మాచర్లలో ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో,  కోడూరులో రెండు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎం ధ్వంసం అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది .

అయితే మిగిలిన 9 చోట్ల ఈవీఎం లను పగలగొట్టిన వీడియో బయటకు రాలేదు .

కానీ పాల్వాయి గేటు వీడియోలోని కొంత భాగం టిడిపి నేతలకు చేరడం వెనుక కుట్ర కోణం ఉందననే అనుమానాలు బలపడుతున్నాయి.

ఈ వ్యవహారంలో నారా లోకేష్ పాత్ర ఉందనే కోణంలో ఎన్నికల సంఘం విచారణ కు దిగినట్టు సమాచారం.

జైలు బయట అదిరిపోయే స్టెప్పులు వేసిన యువకుడు..(వీడియో)