రావి చెట్టును పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

రావి చెట్టును పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాలలో చెట్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి.

రావి చెట్టును పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

కొడుకును కనడం కన్నా బాటలో మహా వృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్య పురాణం చెబుతుంది.

రావి చెట్టును పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

అన్ని వృక్షాలలో కెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు.

విష్ణు నివాసంగా రాగి చెట్టును పరిగణిస్తారు.అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలి పెట్టడానికి ఇష్టపడుతుంటారు.

రావి చెట్టు వేర్లలో విష్ణుమూర్తి, శివుడు చెట్టు కాండంలో, కొమ్మల్లో నారాయణుడు, ఆకులలో హరి, సకల దేవతల గురువు చెట్టు కాయలలో కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది.

సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తుంటారు.రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది.

పుత్ర సంతానం కావాలని కోరుకునేవారు రావి చెట్టుకు ఎర్రని వస్త్రంలో ముడుపు కట్టడం వల్ల పుత్ర సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు.

రావి చెట్టు ఆకులపై దీపారాధన చేయడం వల్ల ఎన్నో రోజుల నుండి ఇబ్బంది పడుతున్న దోష, కర్మ ఫలితాలను నుండి విముక్తి పొందవచ్చు.

రావి చెట్టు ఆకులను తీసుకొని ఆకు కాండం దేవుని వైపు ఉండేలా పెట్టి, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల, మనం అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి.

అంతేకాకుండా కాలసర్ప దోషాలు, నాగ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

మత పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్న రావి చెట్టు శాస్త్రీయ పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.

ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.ఈ చెట్టు యొక్క బెరడు, ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఒకే గొంతు.. ఒకే మాట.. వైరల్ అవుతున్న ఆస్ట్రేలియా కవలలు..