సీఎం జగన్ పై ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య( R Krishnaiah ) ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదని ఓ సంస్కర్త అని అభివర్ణించారు.ప్రతి ఒక్కరిని జగన్ ( CM Jagan ) తన కుటుంబ సభ్యులుగా భావిస్తారని స్పష్టం చేశారు.
నోరులేని వారికి జగన్ అండగా ఉంటున్నారు.ఈ క్రమంలో కొంతమంది నోరున్నవారు ఆయనను విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి జగన్ కి అందరు అండగా నిలబడాలి.మళ్లీ వైసీపీ( YCP ) గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయి.
"""/" /
అందుకే వచ్చే ఎన్నికలలో మరోసారి వైసీపీ పార్టీని ఆదరించండి అని ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత సీఎం జగన్ 2024 ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో( YCP Candidates ) సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గెలుపే లక్ష్యంగా సామాజిక సమీకరణల లెక్కలతో.అన్ని సామాజిక వర్గాల వారికి టికెట్లు ( YCP Tickets ) కేటాయించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
"""/" /
ఇదే సమయంలో ప్రజా వ్యతిరేకత ఉన్న నాయకులను పక్కన పెట్టేస్తున్నారు.
మరొక పక్క బస్సు యాత్రతో 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన పనులు గురించి మంత్రులు, ఎమ్మెల్యేల చేత వివరిస్తున్నారు.
కాగా ఒకప్పుడు బీసీ ఉద్యమ నాయకుడిగా పేరుందిన ఆర్ కృష్ణయ్య.ఏడాదిన్నర క్రితం వైసీపీ పార్టీలో జాయిన్ కావటం.
రాజ్యసభ పదవి పొందడంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
పొడి చర్మంతో చింతేలా.. ఈ సింపుల్ చిట్కాలతో రిపేర్ చేసేయండి!