ఉద్యోగం మానేసి బట్టల వ్యాపారం.. ఇప్పుడు నెలకు రూ.84 లక్షలు సంపాదిస్తోంది..?
TeluguStop.com
ధనవంతులు అవ్వాలంటే ఏదైనా వ్యాపారం చేయాలని చాలామంది చెబుతుంటారు.ఉద్యోగం చేస్తూ ధనవంతులవడం కష్టం అని కూడా అంటారు.
ఆ విషయం తెలుసుకున్న కొందరు మంచి జాబ్స్ వదిలేసి వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు.చాలా కష్టపడి వ్యాపారాన్ని లాభాల్లోకి తీసుకొచ్చి కోట్లు ఆర్జిస్తుంటారు.
ఆ కోవలోకే వస్తోంది ఒక మహిళ.పాకిస్థాన్(
Pakistan ) నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన ఆ మహిళ పేరు జోరీన్ కబాని( Zoreen Kabani (.
ఆమె 2022లో తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకుంది.గోల్డ్‌మాన్ సాక్స్, జెపి మోర్గాన్ చేస్ లాంటి పెద్ద కంపెనీల్లో పని చేసి లక్షల రూపాయలు సంపాదించిన ఆమె, తనకు చాలా ఇష్టమైన దుస్తులను ఆన్‌లైన్‌లో అమ్మే వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది.
పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె చిన్నప్పటి నుండి డబ్బును ఎలా ఆదా చేయాలో తెలుసు.
పాకిస్థాన్‌లో చాలామంది పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు లేదా ఫైనాన్స్ రంగంలో ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు కానీ, జోరీన్ కు మాత్రం ఫ్యాషన్ మీద చాలా ఇష్టం.
ఆమె బట్టలు ఆన్‌లైన్‌లో అమ్మడం మొదలు పెట్టి కొద్ది రోజుల్లోనే చాలా లాభాలు సంపాదించింది.
తన వ్యాపారంపైనే పూర్తిగా దృష్టి పెట్టిన జోరీన్ ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదిస్తోంది.
"""/" /
ఫైనాన్స్ రంగంలో చదువు పూర్తి చేసిన తర్వాత జోరీన్ 2010లో గోల్డ్‌మాన్ సాక్స్( Goldman Sachs )లో పని చేయడం మొదలు పెట్టి, 2013లో జెపి మోర్గాన్ చేస్‌కు మారింది.
పెద్ద కంపెనీల్లో పని చేస్తున్నప్పటికీ, ఆమె తన పనిలో సంతోషంగా లేదు.2022 ఏప్రిల్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసింది.
కొన్ని నెలల తర్వాత, తమ్ముడు ఆమెకు వాట్‌నాట్ అనే అప్లికేషన్ గురించి చెప్పాడు.
ఈ అప్లికేషన్‌లో యూజర్లు లైవ్‌గా వస్తువులను అమ్మవచ్చు.జోరీన్ ఆ అప్లికేషన్‌లోని మహిళల ఫ్యాషన్ విభాగం గురించి తెలుసుకుని, దానిలో చాలా ఆసక్తి పెట్టింది.
"""/" /
ఒక నెలలోనే ఆమె తన పేజీ Zkstyles మొదలు పెట్టింది.
దీని ద్వారా ప్రతి నెల రూ.84 లక్షలు సంపాదిస్తోంది.
మొదటి లైవ్ స్ట్రీమ్ సెటప్ చేసిన తర్వాత, జోరీన్ తన నైపుణ్యాలను ఉపయోగించి సెకండ్ హ్యాండ్ స్టోర్లు, క్లియరెన్స్ సేల్స్ నుండి 50 వస్తువులను కనుగొంది.
మొదటి లైవ్ స్ట్రీమ్ సమయంలో ఆమె దాదాపు 50 మంది వీక్షకులను ఆకర్షించింది.
వారిలో 20-30 మంది ఆమె నుంచి బట్టలు కొనుగోలు చేశారు.వింటేజ్ టీ-షర్ట్‌లు, నైక్ హుడీలు సేల్ అయ్యాయి.
మొదటి నెలలోనే ఈ మహిళ ఏకంగా 10 లక్షలు సంపాదించింది.ఇప్పటికీ ఆమె 75 వేల డ్రస్సులు అమ్మి చాలా కోట్లు వెనకేసింది.
కిరణ్ అబ్బవరం క సినిమా సక్సెస్ సాధించిందా..?