ప్రేమికుల మధ్య పెళ్లి విషయంలో గొడవ.. ఆ యువకుడు ఏం చేశాడంటే..?

దేశ రాజధాని ఢిల్లీలో( Delhi ) ప్రేమికుల మధ్య పెళ్లి విషయంలో గొడవ జరగడంతో.

ఆ ప్రేమికుడు దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.ఈనెల ఏప్రిల్ 12న కరవాల్ నగర్ లోని కృష్ణ పబ్లిక్ స్కూల్ ( Krishna Public School )సమీపంలో ఓ మృతదేహం కనిపించి చుట్టుపక్కల వాళ్లను భయభ్రాంతులకు గురి చేయడంతో, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉత్తరాఖండ్ కు చెందిన 25 ఏళ్ల రోహిన నాజ్ గా గుర్తించి, పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని చుట్టుపక్కల ఉండే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

నాజ్ మృతదేహాన్ని పారేయడంలో నిందితుడికి సహకరించిన అతని సోదరి పారుల్ ( Parul )ను అదుపులోకి తీసుకుని విచారించారు.

అతని సోదరుడు వినీత్, నాజ్ ను హత్య చేసినట్లు తెలిపింది. """/" / వినీత్ 2017లో బాగ్ పట్ లోని రామలా షుగర్ మిల్లులో తన తండ్రితో కలిసి వినీత్( Vineet ) హత్యకు పాల్పడినట్లు తెలియడంతో 2019 అక్టోబర్ 25న తండ్రి కొడుకులు దోషులుగా తేలడంతో వీరిద్దరికీ జీవిత ఖైదీపడింది.

2022 నవంబర్ 26న వినీత్ బెయిల్ పై విడుదల అయ్యాడు.వినీత్ సోదరి పారుల్, నాజ్ లు కలిసి ఢిల్లీలోని ఒక రూమ్ లో ఉండేవారు.

బెయిల్ పై బయటికి వచ్చిన వినీత్ కు నాజ్ కు మధ్య పరిచయం సహజీవనానికి దారితీసింది.

కొంతకాలం సహజీవనం చేసుకున్నాక నాజ్ వివాహం చేసుకోవాలని వినీత్ పై ఒత్తిడి చేసింది.

కానీ మతాలు వేరు కావడంతో వినీత్ కుటుంబం పెళ్లికి నిరాకరించింది.దీంతో నాజ్ ను అమ్మేయాలని వినీత్, పారుల్ ప్లాన్ వేశారు.

ఈ విషయం నాజ్ కు తెలియడంతో ఏప్రిల్ 12న వీరి మధ్య గొడవ ప్రారంభమైంది.

ఈ క్రమంలో వినీత్, నాజ్ గొంతు నొక్కి హత్య చేశాడు.ఆ తర్వాత వినీత్ స్నేహితుడి సహాయంతో పారుల్ ఆ మృతుదేహాన్ని కృష్ణ పబ్లిక్ స్కూల్ సమీపంలో పడేసింది.

పోలీసులు పారుల్ ను అరెస్టు చేసి, పరారీలో ఉన్న వినీత్, అతడి స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.

ఏది నీది కానప్పుడు భయం ఎందుకు… సంచలనంగా మారిన మంచు లక్ష్మీ పోస్ట్!