మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విద్యాలయాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా విద్యాలయం ఆవరణ స్వచ్చత, పరిశుభ్రతను అలాగే స్టోర్ రూంలోని బియ్యం, కూరగాయలు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాలు వారు పరిశీలించారు.

విద్యార్థుల కోసం ఆహారం సిద్ధం చేస్తుండగా, నాణ్యతను తనిఖీ చేశారు.అనంతరం స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు.

తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో పాఠ్యాంశాలు చదివించారు.అనంతరం విద్యార్థులకు పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.విద్యాలయం ఆవరణ స్వచ్ఛంగా.

పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.విద్యార్థులకు సిద్ధం చేసే ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

కుక్, సహాయకులు నిబంధనల ప్రకారం రక్షణ చర్యలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.

తేనెతో నిద్రలేమి ఇక దూరం..!