కల్మలచెరువు రోడ్డు కంపచెట్ల మయం…!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండల కేంద్రం నుండి కల్మలచెరువు గ్రామానికి వెళ్లే రోడ్డు పొడవునా మూలమలుపు వద్ద కంప చెట్లు ఏపుగా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వందల వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగాయని, మూలమలుపు వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నామని వాపోతున్నారు.

ఈ రోడ్డుపై కంపచెట్లతో పాటు పెద్ద పెద్ద గుంతలు కూడా ఉండడంతో ద్విచక్ర వాహనదారులు, ప్రజలు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నామని చెబుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు వెంబడి చెట్లును తొలగించి గుంతలను పూడ్చి ప్రజలు ప్రమాదం భారిన పడకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చంద్రబాబుపై సీబీఐ విచారణ .. హైకోర్టులో పిటిషన్