సెప్టెంబరా నవంబరా ? హుజురాబాద్ ఎన్నిక ఎప్పుడు ? 

అదిగో ఇదిగో అంటూ హడావుడి నడిచినా,  హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు.

కరోనా వైరస్ ప్రభావం, తెలంగాణ లో వరదలు, పండుగలు ఇలా అనేక కారణాలతో ఎన్నికల నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.

దీంతో ఈ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా, బిజెపి కాంగ్రెస్ లు ఢీలా పడ్డాయి.

ఈటెల రాజేందర్ కు హుజూరాబాద్ నియోజకవర్గం లో పెద్ద ఎత్తున సానుభూతి ఉందని , దానిని ఓట్ల రూపంలోకి మలచుకుని మళ్లీ ఈ నియోజకవర్గంలో గెలవాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడే కొద్దీ ప్రజల్లో సానుభూతి తగ్గుతుందనే భయము అటు రాజేందర్ తో పాటు,  తెలంగాణ బిజెపి నాయకులలోనూ నెలకొంది.

అందుకే వీలైనంత తొందరగా ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ అభిప్రాయపడగా టిఆర్ఎస్ మాత్రం ఎన్నికలు ఆలస్యం అయితే ఫలితం అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయంతో ఉంటూ వచ్చింది.

సరిగ్గా కేసీఆర్ ఢిల్లీ టూర్ కి వెళ్ళిన సమయంలోని ఈ ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడడంతో , కేంద్రంలో బీజేపీ పెద్దల సహకారంతో కేసీఆర్ నోటిఫికేషన్ రాకుండా చక్రం తిప్పారు అనే అనుమానాలు కలిగాయి.

ఇదిలా ఉంటే ఈ నెలలోనే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది.

"""/"/ ఈ రోజు కానీ , సెప్టెంబర్ 24న కానీ, అది కుదరకపోతే నవంబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది అనే ప్రచారం జరుగుతోంది.

కానీ ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యమయ్యే కొద్దీ మాత్రం అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతుంది.మరోవైపు చూస్తే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్వే మీద సర్వే చేయిస్తూ ఫలితం ఎలా ఉండబోతోంది అని అంచనా వేస్తున్నారు.

దీనికి తగ్గట్టుగా సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఆదరణ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కొలంబియా వర్సిటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక అల్లర్లు .. భారీగా అరెస్ట్‌లు, న్యూయార్క్ పోలీసులపై ట్రంప్ ప్రశంసలు