ఒకేసారి 30 దేశాలతో తలపడుతున్న రష్యా.. పుతిన్ ధైర్యం మెచ్చుకోవాల్సిందే..

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి ప్రారంభించి ఏడాది దాటింది.ఇరు దేశాలు భీకరంగా పోరాడుతున్నాయి.

ముఖ్యంగా రష్యా దాడులకు ఉక్రెయిన్ ( Ukraine ) వద్ద సమాధానం ఉండడం లేదు.

ఉక్రెయిన్ చిన్న దేశమైనా పోరాట పటిమను ప్రదర్శిస్తోంది.ఉక్రెయిన్‌కు సాయంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలు 30 వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.

నిత్యం ఫైటర్ జెట్‌లు, క్షిపణులు, ఇతర ఆయుధ సామగ్రిని అందిస్తున్నాయి.అయితే రష్యా ముందు అవేమీ నిలవడం లేదు.

పైగా ఇతర దేశాలు అందించిన యుద్ధసామగ్రిని రష్యా తుత్తునియలు చేస్తోంది.పరిశీలించి చూస్తే రష్యా( Russia ) మాత్రం ఒకవైపు, ఉక్రెయిన్ దానికి సపోర్ట్ చేసే 30 దేశాలు ఒకవైపు అన్నట్లు ప్రస్తుత పరిస్థితి ఉంది.

ఏడాదిగా నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్( Vladimir Putin ) తిరుగులేకుండా పోరాడుతున్నారు.

అమెరికా, బ్రిటన్ ఇతర దేశాలు యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాయి.అయితే ఆ దేశాలు పంపించే యుద్ధ సామగ్రి చాలా పాతకాలం నాటివి.

అప్‌డేటెడ్ కాని వాటిని రష్యా అలవోకగా ఎదుర్కొంటోంది. """/" / ఇటీవల యూకే పంపించిన యుద్ధ విమానాన్ని రష్యా నేలమట్టం చేసింది.

ఈ ఘటనలో 88 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు.30 దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తుంటుంటే రష్యా మాత్రం ఒంటరిగా పోరాడుతోంది.

రష్యా వద్ద 5 వేలకు పైగా అత్యంత శక్తివంతమైన అణుబాంబులు ఉన్నాయి.అలాంటి దేశంతో ఉక్రెయిన్ పోరాడుతుందంటే నిప్పుతో చెలగాటం ఆడుతున్నట్లే.

తాము రష్యాపై విజయం సాధిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటనలు చేస్తున్నాడు.

"""/" / ఇరు దేశాల బలాబలాలను పరిశీలిస్తే జెలెన్ స్కీ ( Zelensky ) ప్రకటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇక ఇటీవలే రష్యా తన వద్ద ఉన్న శక్తివంతమైన బాంబును ప్రయోగించింది.దీని ధాటికి ఉక్రెయిన్ నగరాలు చివురుటాకుల్లా వణికిపోయాయి.

ఈ పరిస్థితుల్లో రష్యాపై దాడికి అమెరికా, యూకే, యూరోపియన్ దేశాలు పంపిస్తున్న పాత యుద్ధ సామగ్రితో ఏ మాత్రం ఉక్రెయిన్ పోరాడుతుందనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

Orange, Magadhera : ఆరెంజ్ బ్లాక్ బస్టర్ మగధీర డిజాస్టర్.. రీరిలీజ్ చిత్రాలు నిర్మాతలకు షాకిస్తున్నాయా?