ఇండియా, పాక్ ఒకే గ్రూపులో వద్దు.. ఐసీసీకి పాక్ ఫ్యాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

దుబాయ్ స్టేడియంలో ఆదివారం టీమిండియా అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచింది.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో( ICC Champions Trophy 2025 ) పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా, ఇండియా( India ) ముందు తేలిపోయింది.

గ్రూప్-ఏలో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్.పాక్ బ్యాటింగ్ చేసి 241 రన్స్ టార్గెట్ పెట్టింది.

కానీ రోహిత్ సేన ఊరమాస్ ఇన్నింగ్స్ ఆడింది.కేవలం 42.

3 ఓవర్లలోనే టార్గెట్ కొట్టేసింది.విరాట్ కోహ్లీ( Virat Kohli ) లాస్ట్ రన్ కొట్టగానే ఇండియన్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

ఈ ఓటమితో పాక్ సెమీస్‌కు వెళ్లడం కష్టమే.ఇంకా టోర్నీ నుంచి బయటకు వెళ్లకపోయినా, సెమీఫైనల్ ఛాన్సులు చాలా తక్కువ.

వాళ్ల నెట్ రన్ రేట్ (-1.087) పెద్ద మైనస్ పాయింట్.

ఇంకా రేసులో ఉండాలంటే, మిగిలిన మ్యాచ్‌లలో ఇండియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌ను ఓడించాలి.లేదంటే పాక్ ఇంటికి వెళ్లడం ఖాయం.

"""/" / అయితే పాకిస్థాన్‌( Pakistan ) ఓటమి తర్వాత ఓ అభిమాని వీడియో తెగ వైరల్ అవుతోంది.

సిద్ధిక్ అనే ఆ ఫ్యాన్ ఐసీసీని వేడుకుంటూ.ఇండియా, పాకిస్థాన్‌లను వేర్వేరు గ్రూపుల్లో పెట్టమని ప్రాధేయపడుతున్నాడు.

ఈ హై-టెన్షన్ మ్యాచ్‌లు పాకిస్థాన్‌కు రోజూ అవమానాలే మిగులుస్తున్నాయని వాపోతున్నాడు. """/" / "ఐసీసీ దేవుడా.

ఒక్కసారి వినండి.ఇండియా, పాకిస్థాన్‌లను వేర్వేరు గ్రూపుల్లో పెట్టండి ప్లీజ్.

ఇయర్లీ ఇయర్లీ ఈ అవమానాలు తట్టుకోలేకపోతున్నాం.పిచ్చెక్కిపోతోంది మాకు," అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

అంతే కాదు, ఐసీసీ డబ్బు కోసమే ఇండియా, పాక్‌లను కలిపి ఆడిస్తోందని సిద్ధిక్ ఫైర్ అయ్యాడు.

"డబ్బు సంపాదించడమే మీ టార్గెట్ అయితే.అందులో కొంచెం మాకు కూడా ఇవ్వండి.

మంచి హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్ చేయించుకుంటాం.ఈ అవమానం మరీ దారుణం," అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు.