పుష్ప ట్రైలర్ పై సమంత షాకింగ్ రియాక్షన్..!

సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా పుష్ప.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న సినిమా పుష్ప.

రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజైంది.

అంచనాలకు తగినట్టుగానే పుష్ప ట్రైలర్ ఉందని చెప్పొచ్చు.ఇప్పటికే ఈ ట్రైలర్ చూసిన సెలబ్రిటీస్ సూపర్ అనేస్తుంటే లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో చేరింది సమంత.

నాగ చైతన్యతో డైవర్స్ గురించి ఎనౌన్స్ చేసిన తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న సమంత లేటెస్ట్ గా పుష్ప ట్రైలర్ పై తన రెస్పాన్స్ అందించింది.

సినిమా ట్రైలర్ ని షేర్ చేస్తూ పుష్ప రాజ్ తగ్గేదేలే అని కామెంట్ పెట్టింది.

పుష్ప ఫైర్ కు సమంత కామెంట్ మరింత బూస్టింగ్ ఇచ్చిందని చెప్పొచ్చు.సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే యశోద అనే కొత్త పాన్ ఇండియా సినిమా ఎనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది.

ఆల్రెడీ శాకుంతలం సినిమాతో నేషనల్ వైడ్ సత్తా చాటాలని చూస్తుంది సమంత. """/"/ శాకుంతలం తర్వాత వెంటనే యశోద సినిమాతో సమంత నేషనల్ వైడ్ గా సత్తా చాటాలని చూస్తుంది.

ఆల్రెడీ ఫ్యామిలీ మెన్ సీరీస్ తో హిందీ ఆడియెన్స్ కు దగ్గరైంది సమంత.

చిరంజీవి నెక్స్ట్ సినిమా కోసం ఎంచుకున్న కథ ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు..?