అక్కడ పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేటు ఏకంగా రూ.3000.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
పుష్ప ది రూల్(pushpa The Rule) మూవీ రిలీజ్ కు మరో 72 గంటల సమయం మాత్రమే ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నెల 4వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి పుష్ప ది రూల్ (pushpa The Rule)షోలు ప్రదర్శితం కానున్నాయి.
పుష్ప ది రూల్ ను ఫస్ట్ డే ఫస్ట్ షో (First Day First Show)చూడటానికి అభిమానులు సైతం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు.
ఈ సినిమాను థియేటర్ లో చూడాలంటే జేబులకు చిల్లు పడాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పుష్ప ది రూల్ పెద్ద మూవీ కావడంతో ఈ సినిమా నిడివికి అనుగుణంగా షోల టైమింగ్స్ లో కూడా మార్పులు జరుగుతున్నాయి.
పుష్ప ది రూల్ హిందీ వెర్షన్ టికెట్ ధర 3000 రూపాయలకు అటూఇటుగా ఉండటం గమనార్హం.
పుష్ప ది రూల్ టికెట్ రేట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ముంబైలోని మైసాన్ పీవీఆర్ అనే థియేటర్ లో ఈ రేంజ్ లో టికెట్ రేట్లు ఉన్నాయని సమాచారం అందుతోంది.
"""/" /
కొన్ని థియేటర్లలో అక్కడ టికెట్ రేట్లు ఏకంగా 2400 రూపాయలుగా ఉంది.
పుష్ప ది రూల్ మూవీ ఫస్ట్ డే సులువుగానే 300 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.
పుష్ప ది రూల్ మూవీలో తన పాత్ర మంచి పాత్ర అని రావు రమేష్(Rao Ramesh) చెబుతున్నారు.
పుష్ప3 (puspa 3)కూడా ఉంటుందని రావు రమేష్ అభిప్రాయపడ్డారు. """/" /
పుష్ప ది రూల్ లో అందరికీ మంచి పాత్రలు దక్కాయని ఆయన తెలిపారు.
నేను ఎక్కడికి వెళ్లినా పుష్ప గురించి నాతో మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు.రావు రమేష్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
పుష్ప ది రూల్ సక్సెస్ సాధించడం టాలీవుడ్ కు సైతం కీలకమని తెలుస్తోంది.
కాబోయే పెళ్లి కూతుళ్లు ముఖం కళకళ మెరిసిపోవాలంటే ఇలా చేయండి!