వీక్ డేస్ లో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు.. పుష్ప ది రూల్ కు అదే ప్లస్ అయిందా?
TeluguStop.com
పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
వీక్ డేస్ లో పుష్ప ది రూల్ మూవీ హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.
5 రోజుల్లో ఈ సినిమా ఏకంగా 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.
ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధించడం సులువైన విషయం కాదు.కేవలం హిందీలోనే ఈ సినిమాకు 339 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి.
పుష్ప ది రూల్ సినిమాకు హిట్ టాక్ రావడం, బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం సరైన సినిమా లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ అయిందని తెలుస్తోంది.
ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవడానికి అవసరమైన అన్ని లక్షణాలు పుష్ప ది రూల్ కు ఉన్నాయి.
ఈ ఏడాది ఏ సినిమా సాధించని రేంజ్ కలెక్షన్లు ఈ సినిమాకు రావడం పక్కా అని తేలిపోయింది.
హిందీలో( Hindi ) అయితే న భూతో న భవిష్యత్ అనే రికార్డులు పుష్ప ది రూల్ సొంతం కానున్నాయి.
"""/" /
పుష్ప ది రూల్ మూవీ కలెక్షన్ల( Pushpa 2 Collections ) పోస్టర్లపై కొన్ని నెగిటివ్ కామెంట్లు మాత్రం వినిపిస్తున్నాయి.
అయితే ఆంధ్రలోని కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు.
పుష్ప ది రూల్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు సులువుగా 1500 కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
నేపాల్ లో సైతం పుష్ప ది రూల్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది.
"""/" /
పుష్ప ది రూల్ మూవీ రాబోయే రోజుల్లో విడుదలయ్యే ఎన్నో సినిమాలకు భారీ టార్గెట్ సిద్ధమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పుష్ప ది రూల్ హిట్టైన నేపథ్యంలో ఈ తరహా కథాంశాలతో మరిన్ని సినిమాలు తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పుష్ప ది రూల్ కు బన్నీకి( Bunny ) ఎన్ని అవార్డులు వస్తాయో చూడాల్సి ఉంది.