ఈసారి స్టైలిష్ పుష్పరాజ్ ను చూడబోతున్నామా.. డాన్ గా కూడా తగ్గేదేలే అనిపిస్తాడా?
TeluguStop.com
''పుష్ప ది రూల్'' ( Pushpa The Rule ) గురించి ఈ మధ్య ఏదొక విషయంలో సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.
ఒక్కొక్కటిగా ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ ( Allu Arjun ) ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించింది.
అందుకే ఇప్పుడు పార్ట్ 2 కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా షూట్ గ్రాండ్ గా స్టార్ట్ చేసారు.మరి ప్రజెంట్ శరవేగంగా షూట్ చేస్తున్న ఈ సినిమా నుండి తరచూ ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.
"""/" /
తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే ట్రీట్ రాబోతుంది అని తెలుస్తుంది.
పుష్ప 2 అప్డేట్ కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
మరి ఈ సినిమా ట్రీట్ ఎప్పుడు రాబోతుందో వేచి చూడాలి.ఇదిలా ఉండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ డాన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
సెకండాఫ్ లో ఈ డాన్ లుక్ లో బన్నీ కనిపిస్తాడట. """/" /
అంతేకాదు ఈ లుక్ లో అయితే ఐకాన్ స్టార్ వెరీ స్టైలిష్ గా ఉంటాడని.
అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చూడాలి మరి పుష్ప 2 ( Pushpa ) లో యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో వేచి చూడాలి.
ఇక ఈ సినిమాను దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.కాగా ఈ సినిమా నుండి సుర్ప్రైజ్ ట్రీట్ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ ( Allu Arjun Birthday ) పుట్టిన రోజు కానుకగా వస్తుంది అని సమాచారం.
భర్త క్షేమం కోసం సంచలన నిర్ణయం తీసుకున్న స్నేహ రెడ్డి..41 రోజులపాటు ఉపవాసం!