జోరుగా హైదరాబాద్ లో పుష్ప షూటింగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.

చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో గంధపుచేక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉండబోతుంది.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బన్నీ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ ని నిర్మాతలు ఖర్చు పెడుతున్నారు.

అల్లు అర్జున్ డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో ఎంతోకొంత గుర్తింపు ఉంది.ఇక మలయాళం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అల్లు అర్జున్ ఫ్లాప్ సినిమాలు కూడా మలయాళంలో సూపర్ హిట్ అవుతూ ఉంటాయి.

ఇక తెలుగులో మార్కెట్ ఎలానూ ఉంటుంది.ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ తమిళనాడుకి దగ్గరగా ఉంటుంది.

హీరో క్యారెక్టర్ కూడా తమిళనాడుకి చెందిన పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ గా ఉండబోతుంది.

ఇక కన్నడ ప్రేక్షకులకి కంటెంట్ కనెక్ట్ అయితే కచ్చితంగా చూస్తారు.ఇన్ని బెన్ ఫిట్స్ ఉండటంతో యూనివర్శల్ కాన్సెప్ట్ కావడంతో పుష్ప సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లోని బ‌ర్క‌త్ పుర‌లో బుధ‌వారం షురూ అయింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం అల్లు అర్జున్ ఇత‌ర తారాగ‌ణంపై వెడ్డింగ్ ఫంక్షన్ హాల్ లో కీలక స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు‌.

సినిమా స్మగ్లింగ్ మాఫియా నేపధ్యంలో తెరకెక్కడంతో వాటికి సంబందించిన సన్నివేశాలని షూట్ చేస్తున్నారు.

పుష్ప షూటింగ్ షెడ్యూల్ డిసెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు హైద‌రాబాద్ లో సాగ‌నున్న‌ట్టు తెలుస్తుంది‌.

ఈ షెడ్యూల్ అయ్యాక‌ మ‌ళ్లీ తిరిగి మారెడుమిల్లిలో అట‌వీ ప్రాంతానికి బ‌న్నీ-సుకుమార్ టీం వెళ్ల‌నున్నార‌ని సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన గిరిజన యువతి పాత్రలో కనిపించబోతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్28, సోమవారం 2024