ప్రేక్షకులు థియేటర్లో ఆదరించిన సినిమాగా రికార్డు సృష్టించిన పుష్ప.. రెండో స్థానంలో ఆ సినిమా?

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల పెద్ద సినిమాలన్నీ వాయిదా పడుతూ ఈ ఏడాది వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈ క్రమంలోనే గత ఏడాది చివరిలో అఖండ,పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా విడుదలయి ప్రేక్షకులను ఎంతగానో సందడి చేశాయి.

ఇక ఈ ఏడాది కూడా RRR, కేజిఎఫ్ 2 వంటి పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి.

ఇవేకాకుండా రాధేశ్యామ్, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలయ్యాయి.

గత ఏడాది చివరి నుంచి ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో ఎక్కువగా ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి ఆదరించిన సినిమాలలో పుష్ప సినిమా మొదటి స్థానంలో నిలబడి సరికొత్త రికార్డును సృష్టించింది.

ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమాని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు.కలెక్షన్ల పరంగా RRR, కేజిఎఫ్2 చిత్రాలు ఎక్కువ కలెక్షన్లను రాబట్టినప్పటికీ పుష్ప సినిమాను మాత్రం ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు.

ఈ విధంగా ఈ సినిమాని ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి చూడటానికి కారణం కేవలం సినిమా టికెట్ల రేటు తక్కువగా ఉండటమే.

"""/" / ఈ సినిమా విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల రేట్లు దారుణంగా ఉన్నాయి.

సినిమా టికెట్ రేటు తక్కువగా ఉండటం వల్ల పెద్ద ఎత్తున అభిమానులు ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి ఈ సినిమాని చూశారు.

ఇక RRR, కేజిఎఫ్2, రాధేశ్యామ్, ఆచార్యవంటి సినిమాలు విడుదలయ్యే సమయానికి టికెట్ల రేట్లు అధికంగా ఉండడంతో చాలామంది థియేటర్ కి వెళ్లి సినిమాను చూడటానికి ఇష్టపడటం లేదు.

థియేటర్లలో విడుదలైన నెల రోజులకి సినిమాలు తప్పకుండా ఓటీటీలో విడుదల అవుతాయి కనుక అంత రేటు పెట్టి థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం లేదని ప్రేక్షకులు భావించారు.

అందుకే పుష్ప సినిమా ప్రేక్షకులు ఆదరించిన సినిమాగా మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో RRR, మూడో స్థానంలో కేజిఎఫ్2 చిత్రాలు ఉన్నాయి.

కెనడాలో ఫ్రీ ఫుడ్ పొందచ్చంటూ ఎన్నారై వీడియో.. కట్ చేస్తే జాబ్ గోవిందా..??