పుష్ప ఐటం సాంగ్.. సమంత పోస్టర్ వచ్చేసింది..!

కెరియర్ లో మొదటిసారి అల్లు అర్జున్ కోసం స్పెషల్ ఐటం సాంగ్ చేస్తుంది సమంత.

పుష్ప సినిమాలో సమంత చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.

దేవి శ్రీ ప్రసాద్, సుకుమార్, అల్లు అర్జున్ కాంబో అంటేనే మ్యూజిక్ పరంగా సంథింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుంది.

ఇక అందులోనూ స్టార్ హీరోయిన్ సమంత తో సాంగ్ అంటే దద్దరిల్లిపోవాల్సిందే.అందుకే ఈ సాంగ్ కోసం దేవి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడట.

ఇక ఈ సినిమా నుండి సమంత పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.సమంత బ్యాక్ సైడ్ పోస్టర్ తో అంచనాలు పెంచారు.

ఇప్పటికే పుష్ప నుండి రిలీజైన అన్ని సాంగ్స్ సూపర్ హిట్ కాగా వాటన్నిటిని మించి ఈ సాంగ్ ఉండబోతుంది అన్నది అర్ధమవుతుంది.

తప్పకుండా పుష్పలో ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు హైలెట్ గా చెప్పుకునే దానిలో ఒకటిగా ఉంటుందని అంటున్నారు.

ఈ స్పెషల్ సాంగ్ కోసం సమంత 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్.

సినిమాలో రష్మిక హీరోయిన్ కాగా సమంత ఈ ఒక్క సాంగ్ తో మార్కులు కొట్టేస్తుందని అంటున్నారు.

 మరి సమంత స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో ఊపేస్తుంది అన్నది త్వరలో తెలుస్తుంది.

విదేశీ విద్యకు జగన్ పేరును మారుస్తాం..: లోకేశ్