తన కుటుంబ సభ్యులను గుర్తు పట్టలేకపోతున్న శ్రీ తేజ.. త్వరగా కోలుకోవాలంటూ?
TeluguStop.com
పుష్ప 2 సినిమా( Pushpa 2 Movie ) విడుదల సమయంలో జరిగిన ప్రమాదం గురించి మనందరికీ తెలిసిందే.
రేవతి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది ఈ సినిమా.డిసెంబర్ 4 న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్( RTC Crossroads ) లోని థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఎప్పటికీ మరిచిపోలేము.
ఈ ఘటనలో రేవతి అక్కడికక్కడే మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ అనే 9 ఏళ్ళ బాలుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
అయితే ఈ సంఘటన జరిగి 56 రోజులు పూర్తి అయినా బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని వైద్యులు చెబుతున్నారు.
ఇప్పటికీ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలోనే బాలుడు చికిత్స పొందుతూ ఉన్నాడు. """/" /
ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు శ్రీ తేజ ( Sri Teja )ఆరోగ్యం పట్ల వైద్యులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
వెంటిలేటర్ తొలగించి ప్రత్యేక గదికి వైద్యులు షిఫ్ట్ చేశారు.తానే సొంతంగా ఆక్సీజన్ తీసుకుంటున్నాడు.
అయితే కుటుంబ సభ్యులు పిలిచినా కళ్లు తెరిచి చూడలేకున్నాడు.వారిని గుర్తుపట్టలేనంతగా బాలుడు ఉన్నాడు.
కనీసం నోరు విప్పి ఒక్కమాట కూడా మాట్లాడలేకున్నాడు.తనకు ఆహారం కూడా ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే అందిస్తున్నారట.
వారి కుటుంబ సభ్యులను శ్రీతేజ గుర్తించలేకపోతున్నాడని డాక్టర్లు తెలిపారు.కుటుంబ సభ్యులను గుర్తుపట్టకపోయినప్పటికీ అతని శరీరంలో ఉన్న జీవక్రియలు అన్ని సక్రమంగా జరుగుతున్నాయని డాక్టర్ చేతన్ అలాగే డాక్టర్ విష్ణు తేజ్( Dr.
Vishnu Tej ) తెలిపారు.అయితే బాలుడు ఎప్పుడు కోలుకుంటాడు అన్న విషయాన్ని వైద్యులు చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు.
"""/" /
అయితే శ్రీ తేజ కోలుకొని ఎప్పటిలాగే కళ్ళ ముందు సంతోషంగా తిరిగితే చూడాలని ఉంది అని తండ్రి కోరుకుంటున్నాడు.
రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ పేరుతో అల్లు అరవింద్ రూ.కోటి సాయం ప్రకటించారు.
డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు అందించారు.
మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు ప్రకటించగా మొత్తం రూ.
2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ గా దిల్ రాజుకు గతంలోనే అందించారు.
అయితే శ్రీ తేజ్ తొందరగా కోలుకోవాలని ఆ బాలుడు కుటుంబ సభ్యులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా కోలుకుంటున్నారు.
ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?