పుష్ప కలెక్షన్స్... మంత్రితో సి కళ్యాణ్ మాటలు గుర్తుకు వస్తున్నాయి
TeluguStop.com
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా విడుదల అయ్యింది.
భారీ అంచనాల నడుమ రూపొందిన పుష్ప సినిమా లో బన్నీ లుక్ వీర మాస్ గా ఉండటంతో పాటు రష్మిక మరియు సమంత ల గ్లామర్ మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించాయి అనడంలో సందేహం లేదు.
భారీ ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా ను అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వచ్చి ఎట్టకేలకు విడుదల చేశారు.
ఈ సినిమా మొదటి రోజు 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని.రెండవ రోజుకు 130 కోట్ల వసూళ్లు దక్కించుకున్నట్లుగా చెప్పడం మొదలు పెట్టారు.
ఇక మొత్తం మూడు రోజులకు 173 కోట్ల రూపాయలను సినిమా వసూళ్లు చేసి ఈ ఏడాదికి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అంటూ మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రకటించారు.
ఈ సమయంలో కొందరు సోషల్ మీడియాలో కొన్ని నెలల క్రితం ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఏపీ మంత్రి తో మాట్లాడిన సమయంలో తెలుగు సినిమాల వసూళ్లు జనాలు అనుకున్నంత లేవు అని.
చాలా వరకు మేము పబ్లిసిటీ కోసం చెబుతూ ఉంటాం తప్ప అంత సీన్ లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
"""/" /
సినిమాకు ఎక్కువ వసూళ్లు వచ్చాయి అంటే పబ్లిసిటీ వస్తుందని మేము అలా చేస్తున్నాం కాని అసలు తెలుగు సినిమాలు ఎక్కువ వసూళ్లు నమోదు చేయడం లేదు అంటూ చెప్పేశాడు.
ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు నిజం అయితే పుష్పకు ఇంత వసూళ్లు నమోదు అయ్యి ఉండవు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కలెక్షన్స్ ప్రకటించడంలో మైత్రి వారి తర్వాతే అందరు.కనుక మైత్రి వారు ఖచ్చితంగా ఈ నెంబర్ లో ఏదో మ్యాజిక్ చేస్తున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నారా దేవాన్ష్ ను ప్రశంసించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అసలేం జరిగిందంటే?