ఆర్ఆర్ఆర్, పఠాన్ సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన పుష్ప2.. అసలేం జరిగిందంటే!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్పా 2( Pushpa 2 ) సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నుంచి మొదలైన పోస్టర్లు టీజర్లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.

ఈ సినిమా కోసం పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.కాగా ఇప్పటికే పుష్ప: ది రూల్ కౌంట్‌డౌన్ కూడా ప్రారంభమైంది.

"""/" / మూవీ మేకర్స్ కూడా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ లను రెగ్యులర్ గా పంచుకుంటున్నారు.

దాంతో ఈ సినిమా అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే సంచలనం సృష్టించింది.

పుష్ప 2, పఠాన్,( Pathaan ) జవాన్,( Jawan ) ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాలను బీట్ చేసింది.

ఇటీవల పుష్ప 2 నిర్మాతలు తమ అధికారిక హ్యాండిల్‌ లో ఒక పోస్ట్‌ ను పంచుకున్న విషయం తెలిసిందే.

ఒకదాని తర్వాత ఒకటిగా రికార్డులు బద్దలుకొడుతున్నాయన్న లైన్‌ తో తమ పోస్ట్‌ ను షేర్ చేశారు.

అభిమానులతో శుభవార్త పంచుకుంటూ పుష్ప: ది రూల్ నిర్మాతలు ఇలా వ్రాశారు. """/" / పుష్ప 2 సినిమా యునైటెడ్ స్టేట్స్‌ లో( United States ) అత్యంత వేగంగా 15కే + టిక్కెట్లను విక్రయించిన భారతీయ చిత్రంగా నిలిచింది.

డిసెంబర్ 4న USA ప్రీమియర్, డిసెంబర్ 5, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుందని తెలిపారు.

అంటే అల్లు అర్జున్ పుష్ప 2 కంటే ముందు యూఎస్ఏలో ఏ సినిమా కూడా ఇంత వేగంగా టిక్కెట్లు అమ్ముడుపోలేదు.

ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ పటాన్ సినిమాలను మించిపోయింది పుష్ప 2 సినిమా.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)