ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ బిజినెస్ తో బన్నీ సంచలనం.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప 2(Pushpa 2).

గతంలో విడుదల అయిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న తెలిసిందే.

ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ లు సినిమాపై అంచనాలను పెంచేసాయి.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అంతే కాకుండా టాక్ తో సంబంధం లేకుండా రూ.

1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించగల సత్తా ఉన్న సినిమా అని అందరూ బలంగా నమ్ముతున్న చిత్రం పుష్ప2 అనడంలో ఎటువంటి సందేహం లేదు.

"""/" / ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది.

ముఖ్యంగా తెలుగునాట ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని, ఏకంగా ఆర్ఆర్ఆర్(RRR) సినిమాని మించిపోయిందని తెలుస్తోంది.

నైజాంలో రూ.80 కోట్లు, ఆంధ్రాలో రూ.

85 కోట్లు, సీడెడ్ లో రూ.30 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం.

అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.195 కోట్ల బిజినెస్ చేసింది.

ఇది ఆర్ఆర్ఆర్ కంటే ఎక్కువ కావడం విశేషం. """/" / ఈ బిజినెస్ లెక్కల ప్రకారం తెలుగు నాట పుష్ప-2 బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ.

200 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది.ఇప్పటిదాకా తెలుగు స్టేట్స్ లో ఆర్ఆర్ఆర్, బాహుబలి2 (RRR, Baahubali 2)మాత్రమే రూ.

200 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి.కల్కి రూ.

180 కోట్లకు పైగా షేర్ రాబట్టింది.మరి తెలుగులో పుష్ప 2 సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని, షేర్స్ ని రాపడుతుందో చూడాలి మరి.