పుష్ప 2 విషయంలో బాహుబలి 2, కేజీఎఫ్ 2 సెంటిమెంట్ రిపీట్ అవుతుందా.. బాక్సాఫీస్ బద్దలేనా..!!

2021లో విడుదలైన "పుష్ప: ది రైజ్‌" సినిమా సూపర్ హిట్టైంది.నార్త్ ఇండియాని కూడా షేక్ చేసింది.

మన సౌత్ ఇండియన్స్ కంటే పుష్ప సినిమాని నార్త్ ఆడియన్స్ బాగా ఆదరించారు.

పుష్పరాజ్‌గా బన్నీ చూపించిన మేనరిజం వాళ్లకు తెగ నచ్చేసింది.2024 డిసెంబర్ 6వ తేదీన దీనికి సీక్వెల్ రాబోతోంది.

"పుష్ప: ది రూల్" టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై నార్త్ ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

లేటెస్ట్ టాక్‌ ప్రకారం, నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ రూ.200 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఇది మామూలు విషయం కాదు.పుష్ప 2( Pushpa 2 ) మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో టోటల్ గా రూ.

1,065 కోట్లు వసూలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేదు.

"""/" / ఈ నేపథ్యంలో పుష్ప 2 మూవీ బాహుబలి 2, కేజీఎఫ్ 2 సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

అంటే బాహుబలికి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2, కేజీఎఫ్‌కి సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్ 2 నార్త్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్‌ చేశాయి.

ఫస్ట్ పార్ట్స్ వీరికి బాగా నచ్చడం వల్ల సెకండ్ పార్ట్స్‌ కూడా చూసేశారు.

పుష్ప పార్ట్ 1 కూడా వారికి బాగా నచ్చింది.పార్ట్ 2 సైతం వారు ఖచ్చితంగా చూస్తారనే ఒక సెంటిమెంట్ అయితే బన్నీ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.

నార్త్ సినిమా ఆడియన్స్ సీక్వెల్ అంటే పిచ్చెక్కిపోతున్నారు.అందుకే వీటి నార్త్ ఇండియా కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉంటున్నాయి.

"""/" / ఉదాహరణకి ఏడేళ్ల కింద రిలీజ్ అయిన బాహుబలి 2 కేవలం హిందీలోనే ఏకంగా రూ.

500 కోట్లు కలెక్ట్ చేసింది.ఇక్కడ ఆ స్థాయిలో కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఇదే.

2022లో రిలీజ్ అయిన కేజిఎఫ్ చాప్టర్ 2 ( KGF Chapter 2 )నార్త్ బాక్సాఫీస్ వద్ద రూ.

427 కోట్లు వసూలు చేసింది.ఈ రెండు మూవీల మొదటి భాగాలు హిందీ ప్రాంతాలను వణికించాయి కాబట్టే వాటి నెక్స్ట్ పార్ట్స్ కూడా మంచి హిట్స్ సాధించాయి.

దీని తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో నార్త్ ఆడియన్స్ లో హిట్ అయిన సినిమా లేదు.

మధ్యలో ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది కానీ ఇంచుమించు రూ.250 కోట్లతో సరిపెట్టుకుంది.

కల్కి 2898 AD రూ.300 కోట్లు కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేయలేదు.

ఈ రెండు సినిమాల తర్వాత పెద్ద హిట్ అయింది పుష్ప మాత్రమే.బాహుబలి, కేజిఎఫ్ 2 సినిమాలు హిందీలో బాగా ఆడాయి.

వాటి సీక్వెల్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.ఇప్పుడు పుష్ప 2లో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? ఆ విషయం త్వరలోనే తెలిసిపోతుంది.

హిందీ ప్రేక్షకులు అందరూ పుష్ప మేనియాలో ఉన్నారు కాబట్టి హిందీలో సులభంగా రూ.

600 కోట్లు కలెక్ట్ చేస్తామని పుష్ప మేకర్స్ చెబుతున్నారు.బన్నీ, సుక్కు తమ సినిమాతో ఈ టార్గెట్ రీచ్ అయ్యేలాగానే కనిపిస్తున్నారు.

స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?