పుష్ప2 రిలీజ్ వేళ సంచలన పోస్ట్ పెట్టిన నాగబాబు… మళ్లీ కలుసుకోలేవు అంటూ!
TeluguStop.com
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలలో మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ కూడా ఒకటి.
ఈ రెండు కుటుంబాలు ఒకే విధంగా ఇన్ని రోజులపాటు ఇండస్ట్రీలో కలిసిమెలిసి ముందుకు సాగుతూ వచ్చాయి.
అయితే గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది.దీంతో వీరి అభిమానులు కూడా విడిపోయి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటున్నారు.
ఇక త్వరలోనే అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన పుష్ప 2 సినిమా(Pushpa 2) కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత చెలరేగింది.
"""/" /
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి కానీ మెగా అభిమానులు మాత్రం ఈ సినిమాని చూడమనే ధోరణిలో ఉన్నారు.
ఇలా రెండు కుటుంబాల మధ్య అలాగే ఇద్దరి అభిమానుల మధ్య వివాదం చెలరేగుతున్న సమయంలో మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
అయితే ఈ పోస్ట్ తప్పనిసరిగా అల్లు అర్జున్ ని ఉద్దేశించే చేశారని తెలుస్తోంది.
"""/" /
గతంలో కూడా అల్లు అర్జున్ మావాడు కాదు పరాయి వాడు అనే విధంగా ఈయన పోస్ట్ చేశారు.
అప్పట్లో నాగబాబుపై భారీ స్థాయిలో విమర్శలు రావడంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశారు అయితే తాజాగా స్వామి వివేకానంద(Swami Vivekananda) చెప్పిన ఒక కొటేషన్ ని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇప్పటికే చాలా ఆలస్యమైంది.మీరు తప్పు మార్గాన్ని ఎంచుకున్నారు.
వెంటనే సరిదిద్దుకోండి లేకపోతే మరి మీరు మీ మూలాలను కలుసుకోవడం కష్టం అంటూ ఈయన వివేకానంద కొటేషన్స్ షేర్ చేశారు.
ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన తప్పకుండా అల్లు అర్జున్(Allu Arjun) ను ఉద్దేశించే ఇలాంటి పోస్ట్ చేశారు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా ఈ పోస్ట్ పై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీ లో మెగా హీరోల పరిస్థితి ఏంటి..?