సుకుమార్ తదుపరి సినిమా ఎవరితో క్లారిటీ వచ్చేది అప్పుడేనా!

విభిన్న చిత్రాల దర్శకుల జాబితా లో ముందు ఉండే దర్శకుడు సుకుమార్( Director Sukumar ) మరోసారి తన సత్తా ను పుష్ప సినిమా తో( Pushpa ) చాటాడు.

అల్లు అర్జున్‌ తో ( Allu Arjun ) రూపొందించిన పుష్ప సినిమా ఏకంగా రూ.

400 కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే.ఆ సినిమా యొక్క వసూళ్లు ప్రస్తుతం రూపొందుతున్న పుష్ప 2 యొక్క అంచనాలు ఆకాశానికి పెంచాయి అనడంలో సందేహం లేదు.

సుకుమార్ ఏకంగా రెండు సంవత్సరాల సమయం తీసుకుని పుష్ప 2 సినిమా ను రూపొందిస్తున్నాడు.

పుష్ప సినిమా కోసం మొత్తంగా నాలుగు సంవత్సరాల సమయం ను సుకుమార్ కేటాయించాడు.

"""/" / అంతకు ముందు రామ్‌ చరణ్ తో రంగస్థలం సినిమా ను రూపొందించిన విషయం తెల్సిందే.

రంగస్థలం సినిమా తర్వాత అనుకోకుండా రెండేళ్ల గ్యాప్ వచ్చింది.దాంతో సుకుమార్‌ దర్శకత్వం లో పుష్ప 2 తర్వాత రూపొందబోతున్న సినిమా ఎప్పుడు.

ఎవరి తో అనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది.రంగస్థలం తర్వాత జరిగినట్లుగా మరీ ఎక్కువ గ్యాప్‌ లేకుండా పుష్ప 2 సినిమా విడుదల అయిన వెంటనే కొత్త సినిమా ను సుకుమార్‌ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్‌ లు రెడీ గా ఉన్నాయి.వాటిల్లో ఒకటి రెండు స్క్రిప్ట్‌ లను ఎంపిక చేసుకుని """/" / త్వరలోనే వాటిని తాను అనుకుంటున్న హీరో తో ఫైనల్‌ చేయించుకునే అవకాశం ఉంది.

దాంతో పుష్ప 2 సినిమా విడుదల అయిన వెంటనే ఆ సినిమా మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి సుకుమార్‌ యొక్క తదుపరి సినిమా అనేది కచ్చితంగా పుష్ప 2 సినిమా తర్వాతే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సుకుమార్ పుష్ప 2 సినిమా ను వచ్చే ఏడాది విడుదల చేస్తారా లేదంటే ఇదే ఏడాది చివర్లో విడుదల చేస్తారా అనేది అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.