ఒకవైపు వివాదం.. మరోవైపు సరికొత్త రికార్డులు అల్లు అర్జున్ కే ఇది సాధ్యమైందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) నటించిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకునే డిసెంబర్ 4వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుని ఇప్పటికే 1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటుంది.

కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని చెప్పాలి.

"""/" / ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అని సంతోషపడేలోపు అల్లు అర్జున్ అరెస్టు( Allu Arjun Arrest ) కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే ఇప్పటికీ ఈ కేసు అల్లు అర్జున్ వెంటాడుతూనే ఉంది.ఇలా సంధ్య థియేటర్ తొక్కిసలాట( Sandhya Theatre Stampede ) ఘటనలో భాగంగా అల్లు అర్జున్ పూర్తిగా వివాదంలో చిక్కుకున్నారు.

ఇలా ఒకవైపు వివాదంలో ఉన్నప్పటికీ మరోవైపు మాత్రం తన సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇకపోతే తాజాగా పుష్ప 2 మరో సంచలనమైన రికార్డు సొంతం చేసుకుంది.

మన భారత సినీ ఇండస్ట్రీలోనే తొలి చిత్రంగా ఈ సినిమా ఒక అరుదైన రికార్డు కైవసం చేసుకుంది.

ఇప్పటివరకు బుక్ మై షో( Book My Show ) లో ఎన్నో సినిమాల టికెట్లు అమ్ముడుపోయాయి అయితే ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే పుష్ప 2 సినిమాకు బుక్ మై షో లో అత్యధికంగా టికెట్లు అమ్ముడుపోయినట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు.

ఇప్పటివరకు బుక్ మై షో లో 18 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయినట్టు వెల్లడించారు.

ఇలా బుక్ మై షో లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించడం విశేషం.

వెట్రి మారన్ డైరెక్షన్ లో ఆ స్టార్ హీరో నటించబోతున్నాడా..?