45 వ వార్డు విద్యానగర్ లో వీధి కుక్కల పట్టివేత

సూర్యాపేట జిల్లా: జిల్లా కేంద్రంలోని విద్యానగర్ 45 వ,వార్డులో వీధి కుక్కల బెడద ఎక్కువగా వుండడంతో వార్డు ప్రజలు కౌన్సిలర్ గండూరి పావనికి ఫిర్యాదులు చేశారు.

దీనితో మంగళవారం వార్డులో బయట తిరిగే పిల్లలు, వృద్దులపై కుక్కలు దాడి చేసి కరుస్తున్నాయని పలువురు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ని కలిసి తమ సమస్యను తెలియజేశారు.

వీధి కుక్కల సమస్యపై ప్రజల ఫిర్యాదును మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ దృష్టికి వార్డు కౌన్సిలర్ గండూరి పావని తీసుకుని వెళ్లారు.

కుక్కలను పట్టి తీసుకుని వెళ్లాలని కోరడంతో మున్సిపాలిటీ సిబ్బంది వాహనంతో వచ్చి 45 వ వార్డులో పలు వీధులలో తిరుగుతున్న కుక్కలను పట్టి సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ గండూరి పావని భర్త కృపాకర్ మాట్లాడుతూ ప్రజలు వీధి కుక్కలకు ఆహారం వేయవద్దని, పెంపుడు కుక్కలను వీధులలోకి వదిలిపెట్టవద్దని అన్నారు.

వార్డులో ఏ సమస్య వున్నా మున్సిపల్ అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తున్న కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కు వార్డు ప్రజలు అభినందనలు తెలిపారు.

వార్డును పరిశుభ్రంగా వుంచడంతో పాటు,దోమల నివారణకు దోమల మందు చల్లిస్తున్నారని అభినందనలు తెలిపారు.

వార్డు ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేయడంతో పాటు ఆయుష్మాన్ భారత్, విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పధకాల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా ఉచితంగా ఆన్ లైన్ నందు నమోదు చేస్తున్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ దంపతులకు వార్డు ప్రజలు ధన్యవాదములు తెలిపారు.

వార్డులో మహిళలకు ఉచితంగా కుట్టు మిషను శిక్షణ మరియు మగ్గం వర్క్ శిక్షణను అందిస్తున్నారని అభినందనలు తెలిపారు.

ప్రభాస్ ఓకే అంటే రూ.200 కోట్లు ఇవ్వడానికి సిద్ధమే.. ప్రభాస్ క్రేజ్ కా బాప్ అంటూ?