పురూరవ చక్రవర్తి షట్చక్రవర్తులలో ఒకరా? పురూరవుడు షట్చక్రవర్తులలో ఒకడు.
TeluguStop.com

పురూరవుడు షట్చక్రవర్తులలో ఒకడు. బుధులు పురూరవుని తల్లిదండ్రులు.


ఇతని భార్య పేరు కౌసల్య.జనమేజయుడు పురూరవ చక్రవర్తి కుమారుడు.


ఒక సందర్భంలో పురూరవుడు విప్రుల ధనాన్ని అపహరించాడు.సనత్ కుమారులతో సహా మరికొందరు రుషులు ఇతడికి హితం చెప్పడానికి రాగా వారికి దర్శనం నిరాకరించాడు.
వారందరు కుపితులై నీవు ఉన్మత్తుడవు కమ్ము అని శపించారు.పురూరవుడు ఒక సారి ఊర్వశిని చూచి మోహించాడు.
ఆమె 'నీ ఉరణక ములు (పొట్టేళ్లు) పోయినా నీవు నగ్నుడవై కనిపించినా నిన్నువదలి వెళ్ళి పోతాను' అని షరతు విధించి అతనిలో కలసి మెలసి ఉంటుంది.
శ్రుతాయువు మొదలైన పలువురు పుత్రులు ఆమె వల్ల చక్రవర్తికి కలిగారు.ఒకసారి విశ్వావసుడనే గంధర్వుడు ఊర్వశి ఉరణకాలను అపహరించాడు.
అప్పుడు దిగంబరుడై మంచంపై ఉండిన పురూరవుడు ఉన్నవాడున్నట్లే ఆ గంధర్వుని వెంట పరు గెత్తాడు.
ఆ దృశ్యం ఊర్వశి కంటబడింది.వెంటనే ఆమె అతడిని వదలి వెళ్ళింది.
పురూరవుడు ఉన్మత్తుడై ఊర్వశిని అన్వేషిస్తూ పోయాడు.కురుక్షేత్రంలో ఆమెను చూచాడు.
తనతో రమ్మని అర్ధించాడు.ఆమె సూచన మేరకు గంధర్వులను ప్రార్ధించాడు.
గంధర్వులు అతనికి ఊర్వశికి బదులు అగ్నిస్టాలిని ఇచ్చారు.అతడు దానిని అరణ్యంలో వదలి ఊర్వశినే కలవరిస్తూ ఉండి పోయాడు.
ఇంతలో త్రేతాయుగం వచ్చంది.పురూరవుని దృష్టికి కర్మ బోధకాలైన వేదాలు మూడు మార్గాలు తోచాయి.
అతడు అశ్వత్థాన్ని అరకులుగా చేసి మంత్ర పఠనం కావించాడు.అప్పుడు 'జాతవేదు'డనే అగ్ని జనించింది.
అది అతని పుత్రరూపమై ఆహవనీయాగ్ని అయింది.అగ్నిని పురూరవుడు మూడు భాగాలుగా చేయడంవల్ల నాటినుండి అగ్ని త్రేతాగ్నులుగా మారింది.
ఆ అగ్నులతో యాగంచేసి చక్రవర్తి గంధర్వుల అనుగ్రహం పొందాడు.వాయు దేవుడు పురూరవునికి రాజ ధర్మాలు బోధించాడు.
ఒకసారి పురూర వుడు నైమిశారణ్యానికి పోయాడు.అక్కడ మునులు యజ్ఞం చేస్తున్నారు.
ఆ యజ్ఞవాటికమంతా స్వర్ణమయమై భాసించింది.దాని నెలాగైనా అపహరిం చాలనే దుష్ట సంకల్పం పురూర వునికి కల్గింది.
అది గ్రహించిన మునులు అతణ్ణి వజ్రంతో కొట్టారు.ఆ దెబ్బకు అతడు అసువులు వదలాడు.
ఎన్టీఆర్ విషయంలో ప్రశాంత్ నీల్ భారీ స్కెచ్.. నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారుగా!