చిన్న లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి: పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్ ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరు.బద్రి, ఇడియట్, పోకిరి, టెంపర్ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన దర్శకుడు పూరీ జగన్నాథ్.

ఇన్ని సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో పూరి కనెక్ట్స్ అకౌంట్ ద్వారా ఉన్న ఫాలోవర్స్ ద్వారా తన అనుభూతులను పంచుకుంటున్నాడు.

అయితే తాజాగా ధేడ్ ధిమాక్ పూరీ మ్యూజింగ్స్ పేరుతో లైఫ్ గురించి ఒక చిన్న సందేశాన్ని పోస్ట్ చేశారు పూరి జగన్నాథ్.

రెండురోజులు ఉంటాం.పోతాం.

అన్న ఈ చిన్న లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదని, ప్రస్తుతం మన ముందున్న ఆ పరిస్తితులను ఎంజాయ్ చేస్తే చాలని చెప్పారు.

మనం కోతుల్లా ఒక్కచోట తిన్నగా ఉండకుండా ప్రతి దానిని గెలికి చూస్తే తప్ప మనకు మనశ్శాంతి దొరకదు.

సమాధానాల కోసం ఎదురుచూస్తూ కూర్చోడం మానేస్తే చాలు ఎందుకంటే మన దగ్గర ఎప్పుడూ సమాధానాలు దొరకవు.

ఆత్మ ఏమిటి.దేవుడు ఏంటి.

అసలు జీవితానికి అర్థం ఏమిటి? నువ్వు మనస్ఫూర్తిగా ఒక పాట పాడిన, మనస్ఫూర్తిగా నవ్విన మన లైఫ్ కి ఒక అర్థం ఉంటుంది.

దూరి దూరి ఎక్కడికో లోపలికి వెళ్ళి చూస్తే మనకు న్యూట్రాన్ కనిపించింది.దాని తర్వాత కూడా ఏదో ఉంటది.

మనుషులకు ఎలా ఉంటుందంటే భూమికి బొక్క పెట్టి అందులో మాంటిల్ మొత్తం తవ్వేసి అందులో ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ లోపల ఏమి ఉంటుందో చూడాలనిపిస్తుంది.

గాల్లోకి ఎగిరి పోయి ప్రపంచం ఎక్కడ ముగుస్తుందో చూడాలనిపిస్తుంది.అసలు వీటన్నిటి గురించి మనకెందుకు.

ఎక్కడ మొదలవుతుందో ఎప్పుడు ముగుస్తుందో తెలియనప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముగింపు ఎప్పుడు దొరకదు అని పూరీ క‌నెక్ట్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో ధేడ్ ధిమాక్ పూరి మ్యూజింగ్స్ పేరుతో పూరి జగన్నాథ్ మెసేజ్ ఇచ్చాడు.

ఈ మెసేజ్ ని చుసిన ప్రతిఒక్కరు లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.

ప్రేమలో ఫెయిల్ అయితే అలా మాత్రం చేయొద్దు.. పూరీ జగన్నాథ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!