కుప్పం నుంచే ప్ర‌క్షాళ‌న‌.. టీడీపీలో వారిపై వేటు తప్పదా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోని కొందరు పార్టీ నేతలపై సీరియస్‌గా ఉన్నారు.

స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లో కుప్పంలో పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

సుమారు 35 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితి రాలేదని ఇప్పుడే ఎందుకు వచ్చిందని ఆయన ఆలోచనలో పడ్డారు.

స్థానిక నేతలు పార్టీని బ్రష్టు పట్టించేందుకు వైసీపీతో చేతులు కలిపారని ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ ఓటమికి కారకులయ్యారని, సొంత పార్టీకి చెందిన నేతలో ద్రోహం చేశారని ఆయన సీరియస్ గా ఉన్నారు.

ఇక ఇదే టైంలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులను ఆయను పక్కన పెట్టాలని భవిస్తున్నారట.

గౌరివాని శ్రీనివాసులు సైతం ఆ లిస్టులో ఉన్నాడని టాక్.ఆయనను పార్టీ నుంచి బయటకు పంపిచేస్తారని ఆయన అనుచరులు బహిరంగంగానే చెబుతుండటం గమనార్హం.

మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డికి కుప్పం బాధ్యతలను అప్పగించేందుకు డిసైడ్ అయ్యారట చంద్రబాబు.

మరి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.కుప్పుంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్లాన్ ఆధారంగానే కుప్పంలో వైసీపీ జెండా ఎగిరింది.

పెద్దిరెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించే అమర్‌నాథ్ మాత్రమే పార్టీ బలోపేతానికి కీలకంగా వ్యవహరిస్తారని భావిస్తున్నారట చంద్రబాబు.

"""/" / ఇంత వరకు బాగనే ఉన్నా.ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.

స్థానిక ప్రజలతో, కేడర్‌తో సంబంధాలు ఉన్న నాయకులు.చిన్న తప్పు చేయడంతో వారికి ఏకంగా పార్టీ నుంచి పక్కన పెట్టడం సరికాదు.

ఎందుకంటే వారిని పక్కన పెడితే కేడర్ కూడా పార్టీకి దూరమయ్యే ప్రమాదముంది.ఇలాంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని లేదంటే పార్టీకి నష్టం చేకూరే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరి చంద్రబాబు నాయుడు ఫైనల్‌గా ఏం నిర్ణయం తీసుకుంటారనేదే సస్పెన్స్.

Smartphone Photography Accessories : ఫోన్ లో మెరుగైన ఫోటోలను తీసేందుకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫోటోగ్రఫీ యాక్ససరీస్ లు ఇవే..!