జనగణమన స్టొరీని మహేష్ నుంచి సోనూసూద్ దగ్గరకి తీసుకెళ్ళిన పూరీ

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అతని బ్రాండ్ ఏంటో ఇప్పటికే టాలీవుడ్ లో అందరికి తెలిసిపోయింది.ఎక్కువగా కమర్షియల్ అంశాల చుట్టూ కథలు తెరకెక్కించే పూరీ అప్పుడప్పుడు సోషల్ ఎక్స్పర్మెంట్ సినిమాలు కూడా చేస్తూ ఉంటారు.

అయితే పూరీకి అలా చేసిన సినిమాలు పెద్దగా కలిసిరాలేదు.నేనింతే, నేను నా రాక్షసి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో సోషల్ మెసేజ్ తో చేసిన సినిమాలు.

అయితే ఈ మూడు సినిమాలు పూరీగా ఆనుకున్న సక్సెస్ ఇవ్వలేదు.దీంతో ఇలాంటి సమాజానికి ఉపయోగపడే సందేశాలు ఇవ్వకూడదని నిర్ణయించుకొని తనకి అలవాటైన కమర్షియల్ హీరోయిజం బేస్ చేసుకొని కథలతోనే సినిమాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా పూరీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

అయితే ముంబైలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువ కావడంతో షూటింగ్ వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో జనగణమన అనే టైటిల్ తో ఓ సందేశాత్మక దేశభక్తి చిత్రం తీయాలని ప్లాన్ చేశాడు.

కథ కూడా చెప్పడం జరిగిందని టాక్.అయితే అదే సమయంలో పూరీ ఫ్లాప్ లలో ఉండటంతో మహేష్ బాబు డేర్ చేయలేదు.

ఆ తరువాత ఇదే కథని పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్న అతని డేట్స్ దొరకలేదు.

దీంతో ఆ కథని హోల్డ్ లో పెట్టాడు.అయితే ఇప్పుడు సోనూసూద్ ని హీరోగా పరిచయం చేసేందుకు పూరీ జగన్నాథ్ జనగణమన కథని బయటకి తీసినట్లు తెలుస్తుంది.

పూరీ, సోనూసూద్ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఈ నేపధ్యంలో జనగణమన స్టొరీని సోనూసూద్ హీరోగా హిందీ, తెలుగు బాషలలో చేయాలని పూరీ ప్లాన్ చేసుకుంటున్నట్లు బోగట్టా.

హీరో నానికి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే సత్తా ఉన్నట్టేనా ?