ఎంత అనర్థం జరిగినా త్వరగా మాములు మనిషిగా మారాలి. """/" /
మానసికంగా దృఢంగా ఉండాలి.
రోజుల తరబడి ఏడుస్తూ ఉండకూడదు.ఎంత ఏడ్చినా ఉపయోగం లేనప్పుడు, జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఏడవాలి? వీలైనంత త్వరగా అందులోనుంచి బయటకు రావాలి అని తెలిపారు పూరి జగన్నాథ్.
పక్కవారి సానుభూతి కోసం ఎప్పుడూ ఎదురు చూడవద్దు.మనల్ని ఎవరూ ఓదార్చకూడదు.
మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి.కష్టం వచ్చినప్పుడు బాగా ఏడవండి.
కానీ, వెంటనే పనిలో బిజీగా మారండి.ప్రేమలో విఫలమైన కొందరు మద్యానికి బానిసలవుతారు.
దయచేసి అలా చేయకండి.అది చాలా పిచ్చి పని.
ఎంత నష్టం వచ్చినా తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి.ఎంత కష్టం వచ్చినా ఒత్తిడిగా భావించొద్దు.
అన్నం తినడం మానొద్దు.నీళ్లు తాగడం ఆపొద్దు.
కావాల్సినంత నిద్ర పోవాలి.మన శరీరం కోరుకునే కనీస అవసరాలు తీర్చాలి.
అలా చేస్తేనే మనం కోలుకుంటాం అని ఆయన చెప్పుకొచ్చారు.
భార్య కోపం.. భర్త సంచలన నిర్ణయం! చెత్త కుండీలో లగ్జరీ కారు