రామ్ గోపాల్ వర్మ పరువు కాపాడిన శిష్యుడు… ఎవరు, ఏ విషయంలోనంటే?
TeluguStop.com
ఇప్పుడైతే పలు వివాదాలలో వేలుపెట్టి, వివాదాల దర్శక వర్మగా పేరు పడిపోయాడు కానీ, కొన్ని దశాబ్దాల క్రితం ఇండియన్ దర్శకుడు అంటే, అందరికీ ముందుగా మన రామ్ గోపాల్ వర్మ పేరు మాత్రమే వినబడేది.
అంతలా ఆయన ఇండియన్ సినిమాని శాసించారు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.ఎక్కడో ఆంధ్రా, విజయవాడలో మొదలైన ఆయన ప్రస్థానం బాలీవుడ్ వరకు పాకి, అప్పటి బాలీవుడ్ దర్శకులను తలదన్నే సినిమాలను తీసి, ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకున్నాడు వర్మ.
అందుకే ఇప్పటికీ వర్మ అంటే ఓ వర్గం వారు పడి చస్తారు.ఆయన మొదటగా తెలుగులో అన్న పూర్ణ బేనర్లో, నాగార్జున హీరోగా తీసిన 'శివ' సినిమా( Siva ) ఎటువంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికీ తెలిసినదే.
ఆ సినిమా తరువాత వర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు.ఆ వెంటనే బాలీవుడ్ చెక్కేసి.
భూత్, రంగీలా, సత్య, సర్కార్ అనే సినిమాలతో ఓ ఊపు ఊపేసాడు.ఆ తరువాత కాలంలో ఆయనకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయనే చెప్పుకోవాలి.
"""/" /
కట్ చేస్తే, కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నుండి టాలీవుడ్ రిటర్న్ వచ్చేసిన వర్మ( Ram Gopal Varma ) గత దశాబ్ద కాలానికి పైగా చెత్త చెత్త సినిమాలను తీస్తూ, తన పేరుని తానే క్యాష్ చేసుకుంటూ, పలు రాజకీయ వివాదాలలో చిక్కుకొని సంచలన చిత్రాల దర్శకుడు కాస్త, వివాదాల దర్శకుడు స్థాయికి దిగజారిపోయాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే, పరిస్థితులు ఎలాగున్నా ఆయనని అభిమానించేవారు చాలా మంది ఉన్నారు.ముఖ్యంగా ఆయన శిష్యగణం ఆయనని ఒక ఫిలాసఫర్ లాగా చూస్తారు.
అందులో దర్శకుడు పూరి జగన్నాధ్ ( Puri Jagannadh )ఒకరు.ఆయన రామ్ గోపాల్ వర్మ పరువు కాపాడి, గురువుకి తగ్గ శిష్యుడు అని అనిపించుకున్నాడు.
"""/" /
కొన్నాళ్లక్రితం, ఓ సినిమా ఫంక్షన్లో స్టేజి పైకి వెళ్లిన తన పక్కనే ఉన్న గురువును వర్మని ఉద్దేశించి మాట్లాడుతూ.
ఓ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ ఆయతో, "మీ గురువు ఎక్కడున్నారు? ఇన్కమ్ టాక్స్ ఎగ్గొడుతున్నాడు!" అని ప్రశ్నించడంతో పూరీ.
"సార్ ఇన్కమ్ టాక్స్( Income Tax ) అనేది ఒకటుంటుందని ఆయనికి తెలీదు సార్! అసలు ఆయన డబ్బులు గురించే లెక్క చేయడు.
ఆయన కట్టకపోతే ఏంటి సార్? మేము ఆయన శిష్యులమే.మేము వందల కోట్లు టాక్స్ కడుతున్నాం.
కాబట్టి ఆయనని క్షమించి వదిలేయండి సార్!" అని చెప్పుకొచ్చారు.దాంతో ఆ పక్కనే ఉన్న వర్మ ఈ మాటలకి 'నా శిష్యుడు నా పరువు కాపాడాడు!' అన్నట్టు ఓ లుక్కిచ్చి.
అల్లు అరవింద్ గారు నాకు తండ్రి సమానులు… సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!