లైగర్ తర్వాత పూరీ జగన్నాథ్ పాన్ వరల్డ్ సినిమా.. హీరో ఎవరంటే?
TeluguStop.com
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి మనందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి టెంపర్ సినిమాను చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తరువాత పూరి జగన్నాథ్ కు సరైన సక్సెస్ రాలేదు.ఆ తరువాత హీరో రామ్ పోతినేని తో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.
ఆ సినిమా సక్సెస్ అవడంతో ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో కలసి లైగర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.
ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ను దాదాపుగా 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఒక వీడియో ని విడుదల చేసింది చిత్ర బృందం.
అయితే ఈ సినిమా తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను తెరకెక్కించడమే అని తెలిపాడు.
అంతేకాకుండా ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడమే తన డ్రీమ్ అని తెలిపారు పూరి జగన్నాథ్.
"""/"/
తాజాగా ఆ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నట్టు పూరి జగన్నాథ్ తెలిపారు.
అయితే మొదట ఈ సినిమాను మహేష్ బాబు తెరకెక్కించాలని అని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదర లేదు.
ఇకపోతే ఈ సినిమాను విజయ్ దేవరకొండ తో తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
లైగర్ సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ తోనే జనగణమన సినిమాను చేయాలని చూస్తున్నారు పూరి జగన్నాథ్.
మరి ఈ విషయం పై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు.
దేవర2 మూవీ గురించి కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇదే.. అప్పుడే షూట్ మొదలంటూ?