కొడుకును పట్టించుకోని పూరి జగన్నాధ్…కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ల ప్రతిభను చూపించుకుంటూ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లారు.

ఇంకా అలాంటి వాళ్ళలో పూరి జగన్నాథ్( Puri Jagannadh ) ఒకరు.ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇక రీసెంట్ గా ఆయన చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా( Double Ismart ) తీవ్రంగా నిరాశపర్చడంతో ఆయనను నమ్మి సినిమానిచ్చే హీరోలైతే కరువయ్యారు.

ఇక ఇలాంటి సమయంలోనే ఆయన కొడుకు అయిన ఆకాశ పూరి( Akash Puri ) కూడా పూరి జగన్నాథ్ తో సినిమా చేయనని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి బయట డైరెక్టర్లను నమ్ముకుంటానని అప్పట్లో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు.

"""/" / నిజానికి పూరి జగన్నాథ్ తన కొడుకు అయిన ఆకాశ్ పూరి కాంబోలో ఇంతకుముందు మహబూబా( Mehbooba Movie ) అనే సినిమా చేశాడు.

అయితే ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు.అయినప్పటికీ వీళ్ళ కాంబోలో మరొక సినిమా కోసం ప్రేక్షకులు అమితంగా ఎదురుచూశారు కానీ అది ఇంత వరకు వర్కవుట్ కాలేదు.

నిజానికి ఆకాశ్ పూరి తనదైన రీతిలో నిర్మాణం చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నప్పటికీ అవి ఏవి కూడా పెద్దగా సక్సెస్ లైతే సాధించలేకపోతున్నాయి.

కారణం ఏదైనా అవ్వచ్చు.ఆశించడం మేరకు సక్సెస్ లను సాధించకపోవడంతో ఆకాశ్ పూరి ఇక మీదట పూరి జగన్నాధ్ తో సినిమా చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఇంట్లోనే హీరోని పెట్టుకొని పూరి జగన్నాథ్ మిగతా హీరోలతో సినిమాలు చేయాలని ఎందుకు ఆరాటపడుతున్నాడు అంటు మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మొదట ఆకాశ్ పూరి కి ఇచ్చి తనని కూడా మార్కెట్లోకి పంపిస్తే ఆయన కెరీర్ కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది కదా పూరి జగన్నాథ్ ఎందుకు తన కొడుకు గురించి ఆలోచించడం లేదు అంటూ విపరీతమైన కామెంట్లు చేస్తున్నారు.

పాన్ ఇండియాలో మన హీరోల్లో ఎవరు టాప్ పొజిషన్ లో ఉన్నారు…