పది మంది హీరోయిన్లను పరిచయం చేసిన పూరి.. ఎంతమంది క్లిక్ అయ్యారు అంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు పూరి జగన్నాథ్.

ఇక అందరి దర్శకుల కంటే కాస్త భిన్నంగా పూరి జగన్నాథ్ సినిమాలు ఉంటే ప్రతి డైలాగ్ కూడా ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది.

ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటుంది.తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు పూరిజగన్నాథ్.

అయితే ఇక సినిమాల షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకోవడం మూడు నెలల్లోనే ఒక సినిమా పూర్తి చేయడం చేస్తూ ఉంటాడు దర్శకుడు పూరి జగన్నాథ్.

అంతేకాదండోయ్ టాలీవుడ్లో ఏ దర్శకుడు సాధించని ఒక సరికొత్త ప్రత్యేకత కూడా పూరి జగన్నాథ్ కు ఉంది.

అదే హీరోయిన్లను పరిచయం చేయడం.ఇప్పటి వరకు దాదాపు పది మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు పూరి జగన్నాథ్.

కానీ ఇందులో ఇద్దరు మాత్రమే పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించడం గమనార్హం.

బద్రి చిత్రంతో కెరీర్ ప్రారంభించిన పూరి ఇక ఈ మూవీతో రేణు దేశాయ్, అమీషా పటేల్ ను పరిచయం చేశాడు.

బద్రి సినిమాలో నటించిన రేణుదేశాయ్ మరో సినిమాలో నటించలేదు.చివరికి పవన్ ని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయింది.

ఇక అటు అమీషాపటేల్ కాస్త క్రేజ్ తగ్గడంతో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తోంది.

తమిళ్ బ్యూటీ అక్షిత ను ఇడియట్ అనే సినిమాతో పరిచయం చేశాడు పూరి.

"""/"/ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఒక్కసారిగా హీరోయిన్గా గుర్తింపు వచ్చింది.

ఇక ఆ తర్వాత తెలుగుకు మాత్రమే కాదు పలు భాషల్లో కూడా సినిమాలు చేసి సత్తా చాటింది.

కానీ ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది.అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో ఆసిన్ ను హీరోయిన్ గా పరిచయం చేసాడు.

అన్నవరం సినిమా తర్వాత ఆసిన్ తెలుగులో కనిపించలేదు.బాలీవుడ్కు వెళ్లిన అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు.

చివరికి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది.టాలీవుడ్ సూపర్ హీరోయిన్ అనుష్క శెట్టిని సూపర్ సినిమాతో పరిచయం చేశాడు పూరి జగన్నాథ్.

ఇక అనుష్క బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. """/"/ దేశముదురు సినిమాతో హన్సిక తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.

ఆ తరువాత ఎన్నో అవకాశాలు అందుకున్న హన్సిక తమిళంలో ఇప్పుడు రానిస్తూ ఉండడం గమనార్హం.

ఇక చిరుత సినిమా తో నేహా శర్మ ను పరిచయం చేశాడు పూరి.

ఆ తర్వాత మాత్రం ఎక్కడా టాలీవుడ్ లో కనిపించలేదు.హాట్ బ్యూటీ కాంగనా ను ఏక్ నిరంజన్ సినిమా తో పరిచయం చేశాడు.

ఈ మూవీ పెద్దగా ఆడకపోవడంతో తెలుగులో ఆఫర్లు రాలేదు.హార్ట్ ఎటాక్ సినిమాతో ఆదాశర్మ ను పరిచయం చేశాడు.

"""/"/ పెద్దగా తెలుగులో అవకాశాలు దక్కించుకోలేదు ఈ ముద్దుగుమ్మ.లోఫర్ సినిమాతో దిశా పటాని ని పరిచయం చేస్తే.

ఇక రెండవ సినిమా చేయకుండానే బాలీవుడ్ చెక్కేసింది ఈ సొగసరి.మెహబూబా మూవీ ఫేమ్ నేహా శెట్టి ఇటీవల డీజే టిల్లు సినిమా హిట్తో ఫుల్ జోష్లో కి వచ్చేసింది.

లైగర్ సినిమాతో అనన్య పాండ్యా ని తెలుగు పరిచయం చేసేందుకు రెడీ అయ్యాడు.

ఇలా దాదాపు 10 మంది హీరోయిన్లను పరిచయం చేశాడు పూరి జగన్నాథ్.

Skill Vs Luck: Data Analytics, Player Strategy, And The Reality Behind Bluff Bet Casino For Canadian Crypto Users