కళ్ళు తిరిగే రేట్స్ చెబుతున్న మేకర్స్.. మరి లైగర్ కు అంత పెడతారా..

ప్రెసెంట్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మొదటి సినిమా 'లైగర్'.

ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

దీంతో బిజినెస్ పరంగా కూడా భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.

"""/"/ ఒక్క నైజం ఏరియాకే 40 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.ఇది చాలా ఎక్కువ అనే వార్తలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

అలాగే సీడెడ్ రైట్స్ కి 15 కోట్లు అడుగు తున్నారని.ఈ రేట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

విజయ్ స్థాయికి ఈ రేట్లు చాలా ఎక్కువ అని అంతా అనుకుంటున్నారు.స్టార్ హీరోలకు కోట్ చేసే రేట్స్ ను విజయ్ లైగర్ సినిమాకు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ఒక కానీ అలా కాకుండా ప్లాప్ అయితే మాత్రం విజయ్ మార్కెట్ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఈ సినిమా ఏ మాత్రం అటు ఇటు అయినా ఆ తర్వాత వీరి కాంబోలో వస్తున్న జనగణమన పైన కూడా పడుతుంది.

మరి ఈ బిజినెస్ మేకర్స్ చెప్పిన స్థాయిలో జరుగుతుందా లేదా అనేది చూడాలి.

దేవర మూవీ గురించి ఇండస్ట్రీ టాక్ ఇదే.. ఎన్టీఆర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అంటూ?