'రొమాంటిక్‌' ఎక్కడ పూరి బచ్చన్‌ సాబ్‌

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ దర్శకత్వం లో వచ్చిన సినిమాలతో ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు.

అలాగే ఎంతో మంది సూపర్ స్టార్స్ గా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

అలాంటి పూరి జగన్నాద్‌ తనయుడు రొమాంటిక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

గత ఏడాది ఆకాష్‌ పూరి రొమాంటిక్ మూవీ షూటింగ్‌ ను ముగించుకుని విడుదలకు రెడీ అయ్యింది.

కాని కరోనా వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది.సరే సినిమా ను ఇప్పటికి అయినా విడుదల చేస్తారా అంటే అది కూడా లేదు.

సరే థియేటర్లు లేవు అనుకుంటే ఓటీటీ రిలీజ్ కు అయినా వెళ్లొచ్చు కదా అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.

కాని ఇప్పటి వరకు రొమాంటిక్ కు సంబంధించిన ఎలాంటి అప్‌ డేట్‌ లేదు.

"""/"/ స్వయంగా ఈ సినిమాను పూరి జగన్నాద్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన విషయం తెల్సిందే.

ఆకాష్‌ హీరోగా మొదటి సినిమా మెహబూబా వచ్చింది.ఆ సినిమా షూటింగ్‌ మొదలు అయినప్పటి నుండే అంచనాలు భారీగా పెరిగాయి.

కాని సినిమా విడుదల తర్వాత నిరాశ పర్చింది.రొమాంటిక్ సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలో కూడా అంచనాలు భారీగా వచ్చాయి.

ఆ సినిమా కూడా పూరికి సక్సెస్‌ తెచ్చి పెడుతుందని అంతా నమ్మకం ను వ్యక్తం చేశారు.

కాని ఇప్పటి వరకు సినిమా ను విడుదల చేయకపోవడంతో తీవ్ర నిరుత్సాహం వ్యక్తం అవుతుంది.

నేడు ఆకాష్‌ పూరి పుట్టిన రోజు సందర్బంగా ఆయన ప్రస్తుతం నటిస్తున్న చోర్‌ బజార్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.

షూటింగ్‌ స్పీడ్‌ గా జరుపుకుంటున్న ఈ సినిమాను అతి త్వరలోనే ముగించి విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

చోర్‌ బజార్ విడుదలకు సిద్దం అంటున్నారు కాని ఇప్పటి వరకు రొమాంటిక్ గురించి ఎందుకు స్పందించడం లేదు అంటున్నారు.

చోర్‌ బజార్ లో బచ్చన్‌ సాబ్‌ పాత్రలో పూరి ఆకాష్‌ కనిపిస్తాడట.మాస్‌ పాత్రలో పూరి ని చూపించబోతున్నాడు.

ఇది ఓ విభిన్నమైన సినిమా అంటూ చోర్‌ బజార్ యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

డార్క్ అండర్ ఆర్మ్స్ తో చింతేలా.. నలుపును ఇలా వదిలించుకోండి..!